Brahamamudi: రుద్రాణి వేసిన ప్లాన్ లో మళ్ళీ బలైన కావ్య!
on Aug 20, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -804 లో..... కావ్యని రాజ్ పక్కకి పిలిచి మాట్లాడతాడు. మీరు అంటే నాకు చాలా ఇష్టమని రాజ్ అనగానే.. మీకు ఎన్ని సార్లు చెప్పాలి.. మీరంటే నాకు ఇష్టం లేదని మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు ప్లీజ్ నన్ను ఇలా వదిలెయ్యండి.లేదంటే నేనే ఎక్కడికైనా దూరంగా వెళ్ళపోతానని కావ్య అనగానే.. అయ్యో మీరు ఎందుకు వెళ్లడం నేనే వెళ్ళిపోతానని రాజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
మరొకవైపు అప్పు కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడే కావ్య వచ్చి ఏమైందని అడుగుతుంది. వెంటనే డాక్టర్ ని పిలుస్తారు. డాక్టర్ వచ్చి అప్పుని చెక్ చేసి.. ఏం తిన్నావని అడుగుతుంది. ఇడ్లీ తిని ఆ టాబ్లెట్ వేసుకున్నానని చెప్పగానే డాక్టర్ ఆ టాబ్లెట్ చూసి ఎక్స్ పైరి డేట్ అయిపోయిందని డాక్టర్ చెప్తుంది. అదే విషయం డాక్టర్ బయటకు వచ్చి అందరికి చెప్తుంది. ప్రాబ్లమ్ ఏం లేదు అనీ డాక్టర్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇలా చేసావేంటి కావ్య అని కావ్యని అంటుంది రుద్రాణి. ఆ ట్యాబ్లెట్ వేసుకుంది అప్పు.. కావ్యని అంటావేంటని రుద్రాణిని అడుగుతుంది ఇందిరాదేవి. అంటే అప్పుకి ఆ ట్యాబ్లెట్ ఇచ్చింది కావ్య అని రుద్రాణి అనగానే నిజమేనా అని కావ్యని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అవునని కావ్య అనగానే నీ బుద్ది ఇప్పుడు బయటపడింది.
నువ్వు ప్రెగ్నెంట్ కాలేదని కుళ్ళుగా ఉన్నావ్.. నువు ఒక గొడ్రాలివి అని కావ్యని తిడుతుంది ధాన్యలక్ష్మి. అది భరించలేక కావ్య ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకొకమాట మాట్లాడకు ధాన్యలక్ష్మి.. నీ కోడలు కంటే ముందే కావ్య ప్రెగ్నెంట్ కానీ ఆ విషయం రాజ్ కి ఎలా చెప్పాలని చెప్పలేక అలా మనసులో దాచుకుందని కనకం చెప్పగానే అందరూ షాక్ అవుతారు. కావ్యని ఎన్ని మాటలు అన్నావని ధాన్యలక్ష్మిపై ప్రకాష్ కోప్పడతాడు. అవునండి వెళ్లి సారీ చెప్పాలని ధాన్యలక్ష్మి కావ్య దగ్గరికి వెళ్తుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



