Brahmamudi : రేవతికి దుగ్గిరాల కుటుంబానికి మధ్యగల సంబంధమేంటి.. బ్రహ్మముడిలో ట్విస్ట్!
on Jun 28, 2025
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -759 లో.....కావ్య ఇంకా రావడం లేదని రాజ్ డిస్సపాయింట్ అవుతుంటే.. వస్తుందిలే అని అపర్ణ, ఇందిరాదేవి ఇద్దరు రాజ్ తో మాట్లాడి తనకి హోప్ ఇస్తారు. సరే నేను వెళ్తున్నాను.. రేపు వచ్చి ప్రపోజ్ చేస్తానంటూ రాజ్ వెళ్ళిపోతాడు. వచ్చిన అవకాశం చేజర్చుకుందని కావ్యపై అపర్ణ కోపంగా ఉంటుంది.
ఆ తర్వాత కావ్య, స్వప్నలని రేవతి కాపాడి లోపలికి తీసుకొని వస్తుంది. రేవతి భర్త వచ్చి డోర్ కొడతాడు. రౌడీలు వచ్చారనుకొని కావ్య, స్వప్న టెన్షన్ పడుతారు తీరా చూసేసరికి తన భర్త.. అసలు విషయం రేవతి తన భర్తకి చెప్తుంది. ఆ తర్వాత అప్పు లొకేషన్ కి వచ్చి ఫోన్ చేస్తుంది. కావ్య, స్వప్న ఇద్దరు అప్పు దగ్గరికి వెళ్తారు. అక్కాచెల్లెళ్లు రేవతికి థాంక్స్ చెప్తారు. మీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదని అప్పు అనగానే.. మనది తీర్చుకుంటే తీరిపోయే ఋణం కాదని రేవతి అంటుంది. ఏం అంటున్నారని అప్పు అంటుంది. దాంతో రేవతి డైవర్ట్ చేస్తుంది. ఆ తర్వాత రేవతి లోపలకి వచ్చి ఏదో ఫోటో చూస్తూ ఏడుస్తుంది. అప్పుడే తన భర్త వచ్చి నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే.. నీ వాళ్ళకి దూరంగా ఉన్నావ్.. లేదంటే ఆ కోటలో మహారాణిలాగా ఉండేదానివి ఇన్ని రోజులుగా వాళ్ళ మనసు మారుతుందని వెయిట్ చేస్తున్నావ్ కానీ అది అవట్లేదని అతను అంటాడు.
ఆ తర్వాత కావ్య, స్వప్నలని అప్పు ఇంటి దగ్గర దింపి యామిని దగ్గరికి వెళ్తుంది. కావ్య రాగానే ఇంట్లో వాళ్లంతా ఎక్కడికి వెళ్లావని అడుగతారు. స్వప్న జరిగిందంతా చెప్తుంది. యామిని ఇదంతా చేసిందని కావ్య చెప్తుంది. మరొకవైపు అప్పు వెళ్లి యామిని చెంప చెల్లుమనిపిస్తుంది. తరువాయి భాగంలో యామిని రాజ్ కంపెనీలో బోర్డ్ మెంబర్ తో కలిసి మాట్లాడతుంది. ఆ తర్వాత రాజ్ తో కావ్య ఫోన్ మాట్లాడతుంది. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో నాకు ఫోన్ లో చెప్పండి అని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Brahmamudi episode 759,Brahmamudi June 27th Episode,Brahma Mudi Episode 760,Brahma Mudi
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



