Brahmamudi : రిసార్ట్ కి వెళ్తున్న రాజ్, యామిని.. శోభనాన్ని కావ్య ఆపుతుందా!
on Jun 3, 2025
.webp)
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -737 లో... కళ్యాణ్ ని అప్పు పట్టించుకోకుండా ఫోన్ చూస్తుంటే.. కళ్యాణ్ ఫీల్ అవుతాడు. దాంతో కళ్యాణ్ ఎమోషనల్ గా మాట్లాడుతుంటే అప్పు అలుగుతుంది. తనకి బుజ్జగించి కూల్ చేస్తాడు. మరొకవైపు స్వప్న ఏడువారాల నగలని రాహుల్ తీసుకొని వచ్చి తన గర్ల్ ఫ్రెండ్ కి ఇస్తాడు. అవి చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఆ కంపెనీకి వారసుడిని నేనే అంటూ గొప్పలు చెప్తుంటాడు.
అయితే నాకు ఒక విల్లా కావాలి.. అప్పుడే మన మధ్య ఏదైనా అని తను ఫిట్టింగ్ పెడుతుంది. ఇదేంటీ ఇది నగలు ఇస్తే నా సొంతం అవుతుందనుకుంటే ఇలా అంటుంది. దీన్ని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలని రాహుల్ అనుకుంటాడు. ఆ తర్వాత రాజ్ రెసాట్ కి వెళ్తున్నాడని అపర్ణ, ఇందిరాదేవి కావ్యకి చెప్తారు. దాంతో కావ్య కూడా టెన్షన్ పడుతుంది. ఆ యామిని ఏం ప్లాన్ చేసిందో ఏమో అని అనుకుంటారు. కావ్యని కూడా రెసాట్ కి వెళ్ళమని ఇందిరాదేవి, అపర్ణ చెప్తారు. దాంతో కావ్య కూడా సరే అంటుంది. మరుసటి రోజు అప్పు చీర కట్టులో కళ్యాణ్ కి కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి కళ్యాణ్ ఫ్లాట్ అవుతాడు. దగ్గరికి తీసుకుంటాడు.
ఆ తర్వాత యామిని రెసాట్ కి వెళ్ళడానికి బ్యాగ్ సర్దుతుంది. అప్పుడే వైదేహి వచ్చి మాట్లాడుతుంది. మరోవైపు రాజ్ కి ఇందిరాదేవి ఫోన్ చేసి.. నువ్వు ఎలాగు కావ్య దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసేలా లేవు.. అందుకే కావ్యనే నీ దగ్గరికి పంపిస్తున్నానని ఇందిరాదేవి అంటుంది. దాంతో రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత యామిని, రాజ్ కలిసి రెసాట్ కి స్టార్ట్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



