Brahmamudi : అప్పు, కళ్యాణ్ ల శోభనం.. కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయగలడా!
on May 25, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -730 లో.....అప్పు దగ్గరికి కళ్యాణ్ వెనకాల నుండి వచ్చి హగ్ చేసుకుంటాడు. మనకి ఫస్ట్ నైట్ జరగలేదు గుర్తు ఉంది కదా అని అప్పు అంటుంది. కళ్యాణ్ చెంపపై అప్పు ముద్దు పెట్టి బయటకు పరిగెడుతుంది. తన వెనకాలే కళ్యాణ్ వస్తాడు. ఎదురుగా ధాన్యలక్ష్మి ఉంటుంది. అప్పు కంగారుగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కళ్యాణ్ తడబడుతూ అంటే అమ్మ.. ఫ్రెండ్ శోభనం గురించి మాట్లాడుకుంటున్నామని ధాన్యలక్ష్మితో కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత వీడిని ఏం అడగలేదు.. లేదు అంటే వీళ్ళకి శోభనం జరగలేదా.. నా కొడుకు కి ఏ సుఖం లేకుండా చేస్తుంది ఆ అప్పు అని ధాన్యలక్ష్మి కోపంగా అంటుంది.
ఆ తర్వాత రాజ్ ఇంటికి వస్తాడు. ఏంటి బావ అంత హుషారుగా ఉన్నావని యామిని అడుగుతుంది. ఏంటి బాబూ ఎప్పుడు వెళ్తున్నావో ఎప్పుడు వస్తున్నావో ఏం అర్ధం కావడం లేదు.. నీ కోసం ఇంట్లో వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు కదా అని యామిని వాళ్ళ నాన్న రాజ్ తో అంటాడు. రాజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. బావ ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాడో నాకు తెలుసు.. రేపు ఆ కావ్యకి ప్రపోజ్ చేస్తున్నాడని యామిని అంటుంది.
ఆ తర్వాత ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వస్తుంది. ఆ అప్పు నా కొడుకుని దూరంగా ఉంచుతుందని ధాన్యలక్ష్మి చెప్తుంది. నేను చెప్పినట్టు చెయ్. దాంతో అది ఉద్యోగం మానేస్తుంది. నీకు చేతిలో మనవడిని పెడుతుంది. నువ్వు అర్జెంట్ గా శోభనానికి ముహూర్తం పెట్టమని రుద్రాణి చెప్తుంది. మరొకవైపు రేపు రాజ్ నీకు ప్రపోజ్ చేస్తున్నాడు కదా అని కావ్యని స్వప్న, అప్పు ఆటపట్టిస్తారు.. ఆ తర్వాత స్వప్న నగలు తనకి తెలియకుండా రాహుల్ దొంగతనం చేస్తాడు. తరువాయి భాగంలో కావ్యని రాజ్ కలిసి మాట్లాడతాడు దూరంగా ఉంటే ప్రేమగా మాట్లాడుతావు.. ఇలా దగ్గరగా ఉంటే కంగారుపడతావని కావ్యతో రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



