Brahmamudi : కావ్యని లేపెయ్యడానికి యామిని స్కెచ్.. రాహుల్ ని పట్టుకున్న స్వప్న!
on Jun 5, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -739 లో......కావ్య గదిలో రాజ్ ని చూసి వెయిటర్ షాక్ అవుతాడు. మీరేంటి ఇక్కడ అని రాజ్ ని అడుగగా రాజ్ తడబడుతుంటాడు. అంటే ఇందాక నా ఫ్రెండ్ రూమ్ లో నన్ను చూసి మళ్ళీ ఇక్కడ చూసి షాక్ అయ్యాడని రాజ్ కవర్ చేస్తాడు. మీ సంగతి ఆ మేడమ్ కి చెప్తాను అని వెయిటర్ యామిని దగ్గరికి వెళ్తాడు. మీతో ఉన్న సార్ మిమ్మల్ని మోసం చేస్తున్నాడని చెప్తాడు.
అప్పుడే రాజ్ వచ్చి అదేం లేదు యామిని.. ఇందాక నా ఫ్రెండ్ రూమ్ కి వెళ్తానన్న కదా తన రూమ్ లోకి వెళ్ళబోయి ఒక అమ్మాయి రూమ్ లోకి వెళ్ళాను. అప్పుడే అతను చూసాడని రాజ్ అంటాడు. లేదు మేడం మిమ్మల్ని మోసం చేస్తున్నాడని యామినితో వెయిటర్ అనగానే.. నా బావ నన్ను మోసం చెయ్యడని యామిని అంటుంది. యామినిని తీసుకొని రాజ్ గదిలోకి వెళ్తాడు. రాజ్ కి దగ్గరగా యామిని వస్తుంది. అప్పుడే కావ్య ఫోన్ చేసి నేను వెళ్లిపోతున్నానని చెప్తుంది. వద్దు నేను వస్తున్నానంటు రాజ్ యామినికి చెప్పి అక్కడ నుండి కావ్య దగ్గరికి వెళ్తాడు. కావ్య, రాజ్ వెళ్తుంటే యామిని చూస్తుంది. నన్ను ఇంత చీట్ చేస్తావా బావ అని యామిని అనుకుంటుంది. వెంటనే యామిని రౌడీకి ఫోన్ చేసి కావ్యని లేపేయ్యమని చెప్తుంది.
మరొకవైపు అప్పు కిచెన్ లో వంట చేస్తుంటే.. కళ్యాణ్ వచ్చి తన నడుం పట్టుకుంటాడు. గదిలోకి రా అని అంటుంటే.. అప్పుడే స్వప్న వస్తుంది. దాంతో అప్పు, కళ్యాణ్ ఇద్దరు సిగ్గుపడతారు. రాహుల్ వస్తాడు. వాళ్ళతో స్వప్న మాట్లాడుతుంటే తనకి తెలియకుండా స్వప్న చీరకి ఉన్న లాకర్ తాళాన్ని తీసుకొని వెళ్తాడు రాహుల్. కాసేపటికి గిల్టీ నగలని రాహుల్ లోపల పెడుతుంటే అప్పుడే స్వప్న వస్తుంది. నగలు దొంగతనం చేస్తున్నావని గొడవ చేస్తుంది. అందరికి చెప్తుంది. తరువాయి భాగం లో రాజ్, కావ్యలని ఒకటి చెయ్యాలనుకుంటున్నాం.. ఈ టైమ్ లో రాహుల్, స్వప్న గొడవ ఎందుకని ఇందిరాదేవి, అపర్ణ అనుకుంటారు. స్వప్న ని గొడవ చెయ్యకని అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



