Brahmamudi : వాళ్ళని రౌడీల నుండి కాపాడిన అప్పు.. యామినితో పెళ్ళి వద్దన్న రాజ్!
on Jun 8, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -742 లో... కావ్య ఆకలిగా ఉందంటే రాజ్ ఏవో ఫ్రూట్ తీసుకొని వచ్చి కావ్యకి ఇస్తాడు. ఇద్దరు ఆ ఫ్రూట్ తిని మత్తుగా పడిపోతారు. అదే సమయంలో వాళ్ళని రౌడీలు చూసి.. కావ్య దగ్గరికి కత్తి పట్టుకొని వస్తారు. మరొకవైపు ఏంటి ఈ కావ్య ఫోన్ కలవట్లేదని ఇందిరాదేవి అనగానే.. ఇంట్లో వాళ్ళందరు వాళ్ళకి ఏమై ఉంటుందని టెన్షన్ పడతారు. అప్పు వెళ్ళింది కదా ఖచ్చితంగా తీసుకొని వస్తుందని అపర్ణ అంటుంది. అప్పు ఏమైనా వీరానారీనా.. నిన్న మొన్న డ్యూటీ లో జాయిన్ అయిందని తన గురించి రుద్రాణి నెగెటివ్ గా మాట్లాడుతుంటే.. ఇంట్లో వాళ్ళందరు రుద్రాణిని తిడతారు.
మరోవైపు యామిని టెన్షన్ పడుతుంటే వైదేహి తన దగ్గరికి కాఫీ తీసుకొని వెళ్తుంది. ఆ కావ్యని చంపమని సుపారీ ఇచ్చాను.. ఆ రౌడీలు ఇంకా ఫోన్ చెయ్యలేదని యామిని అంటుంది. ఎందుకు ఇదంతా అని వైదేహి అడుగుతుంది. బావని నా సొంతం చేసుకోవడానికి నేను ఏమైనా చేస్తానని యామిని అంటుంది. నా కూతురు రాను రాను ఇలా తయారవుతుంది ఏంటని వైదేహి టెన్షన్ పడుతుంది.
ఆ తర్వాత రాజ్ , కావ్య నిద్ర లేచేసరికి వాళ్ళ ముందు రౌడీలు ఉంటారు. రౌడీలు చెట్టుకి కట్టేసి ఉంటారు. వాళ్ళని చూసిన రాజ్.. కావ్య అలా చేసిందని తనకి రాజ్ కంగ్రాట్స్ చెప్తాడు. అది చేసింది నేను.. మా అక్క కాదని అప్పు అంటుంది. మీరిద్దరు స్పృహలేకుండా పడి ఉంటే రౌడీలు ఎటాక్ చేస్తుండగా.. మేమ్ వచ్చి వాళ్లని పట్టుకున్నామని అప్పు చెప్తుంది. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు పంపించారని రౌడీలని అడుగుతుంది అప్పు. వాళ్ళు సమాధానం చెప్పరు. కావ్యని తీసుకొని అప్పు ఇంటికి వెళ్తుంది. ఇద్దరు అక్కడ జరిగిందంతా ఇంట్లో వాళ్లకు చెప్తారు.
మరొకవైపు రాజ్ ఇంటికి వెళ్లేసరికి ఇల్లంతా డెకరేషన్ చేసి ఉంటుంది. ఏంటి స్పెషల్ అని రాజ్ అనగానే.. ఎల్లుండి మీ పెళ్లి కదా అని వైదేహి అంటుంది. రాజ్ షాక్ అవుతాడు. తరువాయి భాగం లో నాకు ఇప్పుడు పెళ్లి ఇష్టం లేదని రాజ్ అనగానే అందరు కలిసి రాజ్ ని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



