Brahmamudi:జాతకాలు కలవలేదని ధాన్యలక్ష్మిలో మొదలైన భయం!
on Dec 8, 2023
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -273 లో.... అనామిక, కళ్యాణ్ ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చెయ్యడానికి అనామిక పేరెంట్స్ దుగ్గిరాల ఇంటికి వస్తారు. ఆ తర్వాత పంతులు వచ్చి జాతకలు చూస్తుంటాడు. కానీ కనకం రాత్రి వెళ్లి జాతకాలు కలవలేదని అబద్ధం చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తుంది. దాంతో పంతులు ప్రతీసారి కనకం వైపు చూస్తుంటాడు.
ఆ తర్వాత పంతులు మాటిమాటికీ కనకాన్ని చూస్తుంటే.మ ఏంటి అలా చూస్తున్నాడని రుద్రాణి అనుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరి జాతకాలు కలువలేదని పంతులు అబద్ధం చెప్తాడు. అలా ఒక వేళ వీళ్ళ ఇద్దరికి పెళ్లి చేస్తే ఇంటి పెద్ద ఆరోగ్యం బాగుండదని పంతులు అనగానే.. అవును ఈ పెళ్లి అనుకుంటున్నప్పటి నుండి మామయ్య గారికి ఆరోగ్యం బాగోలేదని ధాన్యలక్ష్మి అంటుంది. వీటికి పరిష్కారం చుడండి అని ఇంట్లో వాళ్ళు అనగానే.. ఒక నిమ్మ మొలక రాత్రి పెట్టి తెల్లవారే సరికి అది అలాగే ఉంటే ఈ దోషం తొలగిపోయినట్టు వాడిపోయి ఉంటే దోషం తొలగిపోనట్లని, అలా కాదని పెళ్లి చేస్తే ఇద్దరు విడిపోతారని పంతులు చెప్తాడు. ఆ తర్వాత కనకానికి అప్పు చెప్పి ఇంటికి వెళ్తుంది.
మరొకవైపు కావ్య బుక్ చూస్తూ జాతకం చూస్తుంటుంది. రాజ్ వచ్చి ఏం చేస్తున్నవని అడుగుతాడు. ఇక రాజ్ కి తన మాటలతో చుక్కలు చూపిస్తుంది. మరొకవైపు ధాన్యలక్ష్మి దగ్గరికి కనకం వెళ్తుంది. నిజంగా జాతకాలు కలవకుంటే అలా జరుగుతుందా అని అనగానే.. జరుగుతుందని ధాన్యలక్ష్మిని ఇంకా బయపెడుతుంది కనకం. ఆ తర్వాత కనకం చెప్పిన దాని గురించి ఆలోచిస్తుటుంది ధాన్యలక్ష్మి. తరువాయి భాగంలో.. రాజ్ కావ్య ఇద్దరు కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. ఇంట్లో వాళ్ళని కాదని వాళ్ళ పెళ్లి చెయ్యాలేమని రాజ్ అంటాడు. మరొకవైపు నిమ్మమొక్క వాడిపోయేలా కనకం చేస్తుంది. తెల్లవారి నిమ్మమొక్క వాడిపోవడం చుసి అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



