విగ్రహాలని రాజ్ కనిపెట్టి కృష్ణమూర్తి ఫ్యామిలీకి అండగా ఉంటాడా!
on Sep 23, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-208 లో.. కృష్ణమూర్తి చేసిన విగ్రహాల దగ్గరికి వెళ్ళి అన్నీ చూస్తుంటాడు. అప్పుడే అక్కడికి రాహుల్ పంపించిన రౌడీలు వస్తారు. రాహుల్ వాళ్ళకి కాల్ చేసి.. ఏమైందని అడుగుతాడు. ఏం చేయలేదు సర్.. ఆ కృష్ణమూర్తి ఉన్నాడని, మీరే కదా ఎవరికి కనబడకుండా పని పూర్తి చేయమన్నారని ఆ రౌడీ చెప్తాడు. ఇంకో గంట అయితే తెల్లారిపోతుంది అందరికి తెలిసిపోతుంది ఏదో ఒకటి తొందరగా చేయండని రాహుల్ అంటాడు.
మరొకవైపు కావ్య, అప్పు, కనకం ఇంటిముందు డీజే పాటలతో డ్యాన్స్ చేస్తుంటారు. అప్పుడే రాజ్ వచ్చేసరికి అందరు సిగ్గుపడుతూ డ్యాన్స్ చేయడం ఆపేస్తారు. ఆ తర్వాత అప్పు చూసి.. మన బావే కదా.. రా బావ అని డ్యాన్స్ చేద్దామని బలవంతం చేయగా.. బుల్లెట్ బండి పాటకి అందరు కలిసి డ్యాన్స్ చేస్తుంటారు. మరొక రౌడీలు కృష్ణమూర్తిని బెదిరించి వినాయకుడి విగ్రహాలు తీసుకెళ్తుంటారు. మా కష్టార్జితం బాబు, తీసుకెళ్ళొద్దంటూ ఎంత రిక్వెస్ట్ చేసిన ఆ రౌడీలు వినకుండా కృష్ణమూర్తిని కొట్టేసి డీసీఎమ్ వ్యాన్ లలో ఎక్కించుకొని తీసుకెళ్తుంటారు. ఇక అక్కడే ఉన్న బంతి అనే అబ్బాయి.. ఈ విషయం ఎలాగైనా కావ్య అక్కకి చెప్పాలని పరుగున ఇంటికి వస్తాడు. అక్కడికొచ్చి విగ్రహాలన్నీ తీసుకెళ్తున్నారని చెప్తాడు. అది విని రాజ్, కావ్య, అప్పు , కనకం అందరూ ఆ ప్లేస్ కి వచ్చేస్తారు.
వాళ్ళంతా అక్కడికి వచ్చేసరికి వొంటి నిండ రక్తపు మరకలతో కృష్ణమూర్తి పడి ఉంటాడు. అతడిని చూసి ఇంట్లో వాళ్ళంత కన్నీరుమున్నీరవుతారు. నా ఆశలన్నీ అడియాశలయ్యాయి బాబు, అప్పు కోసం ఈ కాంట్రాక్ట్ ఒప్పుకున్నాను. ఈ డబ్బులొస్తే సొంత ఇల్లు దక్కుతుంది. ఆ ఇల్లు చూసి అయిన అప్పుకి మంచి సంబంధం తీసుకొద్దామని అనుకున్నాను, ఇప్పుడు చేతకానివాడిలా మిగిలిపోయాయని రాజ్ తో కృష్ణమూర్తి అంటాడు. ఇక కృష్ణమూర్తి అలా విగ్రహాలు పోయాయని చెప్తుండగా ఆ కాంట్రాక్టర్ వస్తాడు. అయ్యో అయ్యో విగ్రహాలు పోయాయా? నా ప్రాణాలు తీసేస్తారు ఆర్డర్ ఇచ్చినవాళ్ళు అని అంటాడు. రాజ్ డబ్బులిస్తానని అనగా.. డబ్బులెవరికి కావాలి సర్. విగ్రహాలు కావాలిని, డబ్బులతో ప్రతీ దాన్ని కొనలేరని రాజ్ తో ఆ కాంట్రాక్టర్ అంటాడు. కాసేపటికి రాజ్ ఒక క్లూ కనిపెడతాడు. మనం వస్తున్నప్పుడు రెండు డీసీఎమ్ వ్యాన్ లు వెళ్ళాయని, అందులోనే ఆ విగ్రహాలని తీసుకెళ్ళారని, ఇదొక్కటే ఈ ప్లేస్ కి రావడానికి దారి అని, ఆ డీసీఎమ్ ల నెంబర్లు చెప్తాడు రాజ్. దాంతో అప్పు తన మనుషులతో వెతుకుతుంటుంది. రాజ్ తన పలుకుబడి ఉపయోగించి వ్యాన్ ల కోసం వెతుకుతుంటాడు. మరొకవైపు రాహుల్ కి ఆ రౌడీలు కాల్ చేసి..ఈ విగ్రహాలని ఏం చేయమంటారని అడుగుతాడు. ఎక్కడైనా చెరువులో పడేయండని రాహుల్ అనగానే వద్దు సర్.. అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయని ఆ రౌడీ అంటాడు. అలా ఆశపడకండి మీరు కావాలన్నంత డబ్బు ఇస్తాను వాటిని ఎవరూ చూడకుండా చెరువులో పడేయండని రాహుల్ అనగానే.. సరేనని ఆ రౌడీ అంటాడు. మరొకవైపు రాజ్ వాళ్ళ కోసం తీవ్రంగా గాలిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే .

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
