Brahmamudi : బెయిల్ పై అప్పుని తీసుకొచ్చిన కావ్య.. రేవతి ఎవరంటే!
on Jul 12, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -771 లో..... అప్పు సస్పెండ్ అవ్వడంతో తన యూనిఫామ్ ని స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఇక సెల్ లోకి వెళ్ళండి అని ఏసీబి వాళ్ళు అప్పు తో అంటారు. అప్పుడే అప్పుకి బెయిల్ తీసుకొని వస్తుంది కావ్య. ఇంత త్వరగా ఎలా బెయిల్ వచ్చిందని ఆఫీసర్ అడుగగా అప్పుకి ఇంతకి ముందు ఎలాంటి నేర చరిత్ర లేదు అందుకే త్వరగా వచ్చిందని కావ్య తీసుకొని వచ్చిన లాయర్ అంటాడు.
ఆ తర్వాత అప్పు గురించి ఆఫీసర్ తప్పుగా మాట్లాడుతుంటే.. మా అప్పు దుగ్గిరాల ఇంటి కోడలు అనీ కావ్య అనగానే అలాంటి కుటుంబం లో ఉంటూ ఇలా చెయ్యడమేంటని ఆఫీసర్ అనగానే మా చెల్లి ఏం తప్పు చెయ్యలేదు. నేను నిరూపిస్తానని కావ్య అంటుంది. సరే ఎల్లుండి కోర్ట్ కి అయితే రండి అని ఆఫీసర్ అంటాడు. రాజ్ డిస్సపాయింట్ గా ఇంటికి వెళ్తాడు ఏమైందని యామిని అడుగుతుంది. అప్పు సస్పెండ్ అయిందని కావ్య వెళ్ళిందనగానే కావ్యని ప్రపోజ్ నుండి తప్పించుకోవాలని లా చేసిందేమోనని యామిని అంటుంటే అలా కావ్య చెయ్యదని యామినితో కోపంగా మాట్లాడుతాడు రాజ్.
మరొకవైపు అప్పు లంచం తీసుకొని దొరికిపోయిందని ఇంట్లో వాళ్లకి చెప్తుంది రుద్రాణి. అప్పుడే కావ్య, అప్పు ఇంటికి వస్తారు. ఎందుకు ఇలా చేసావని ధాన్యలక్ష్మి అప్పుపై కోప్పడుతుంది. నా చెల్లి ఏం తప్పు చెయ్యలేదని నిరూపిస్తాను లేదంటే నా చెల్లి మీకు నచ్చినట్టుగా ఉంటుందని కావ్య అంటుంది. తరువాయి భాగంలో రేవతి దగ్గరికి ఇందిరాదేవి వెళ్తుంది. రేవతి నానమ్మ అంటూ ఇందిరాదేవిని హగ్ చేసుకుంది. అప్పుడే కావ్య, రాజ్ రేవతి వాళ్ళ డోర్ కొడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



