Brahmamudi : అపర్ణని అమ్మ అని పిలిచిన రాజ్.. గతం గుర్తొచ్చినట్టేనా!
on Apr 17, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -697 లో..... కావ్యకి రాజ్ గిఫ్ట్ ఇచ్చిన షర్ట్ ని చూసి ఆ షర్ట్ ఇచ్చిన సందర్బం గుర్తు చేసుకుంటుంది. ఈ షర్ట్ ఆయనకి ఎలాగైనా ఇవ్వాలని అనుకుంటుంది. రాజ్ కి ఫోన్ చేస్తుంది. రేపటికి వంటలు మీరే ప్రిపేర్ చేస్తానన్నారు కదా అని రాజ్ అనగానే.. అది నేను చూసుకుంటాను కానీ మీకు ఒక సర్ ప్రైజ్ పంపిస్తున్నానని కావ్య అంటుంది. ఏమై ఉంటుందని రాజ్ ఆలోచిస్తుంటాడు. అప్పుడే కొరియర్ వస్తుంది.
వామ్మో కింద యామిని ఉంది తను వెళ్లకముందే నేను వెళ్ళాలని రాజ్ యామిని కంటే ముందు వెళ్లి కొరియర్ తీసుకుంటాడు. బావ ఏంటి ఇలా బెహేవ్ చేస్తున్నాడని యామిని అనుకుంటుంది. రాజ్ గదిలోకి వెళ్లి కొరియర్ ఓపెన్ చేస్తాడు. షర్ట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే కావ్యకి ఫోన్ చేసి షర్ట్ బాగుంది ఈ షర్ట్ లో మీ అభిమానం కన్పించిందని రాజ్ అంటాడు. ఆర్ అనే లెటర్ ఉంది కదా అంటే ఏంటి ఏమైనా గుర్తు వచ్చిందా అని కావ్య అనగానే.. ఇంకేంటి ఆర్ అంటే రామ్ అని రాజ్ అంటాడు. మరుసటిరోజు ఉదయం కావ్య అన్ని వంటలు ప్రిపేర్ చేసి డ్రైవర్ చేత కార్ లో పెట్టిస్తుంది. అపర్ణ కూడా హ్యాపీగా ఉంటుంది.
ఏంటి వదిన నిన్న మొన్న నాకు బర్త్ డే ఎందుకని అన్నావ్.. ఇప్పుడు అన్నదానం జరిపిస్తున్నావని రుద్రాణి అనగానే.. మరి అక్కడ నా కొడుకే కదా అన్నదానం చేసేదని అపర్ణ అనగానే అందరు షాక్ అవుతారు. అంటే నా కొడుకు ప్లేస్ లో నా కోడలు చేస్తుందని అపర్ణ తర్వాత కవర్ చేస్తుంది. అపర్ణ, కావ్య గుడికి వెళ్తారు. అప్పు వెళ్తుంటే నువ్వు ఎక్కడికి వాళ్ళకి సెక్యూరిటీ నా వెటకారంగా మాట్లాడుతారు. తరువాయి భాగంలో రాజ్ ని అపర్ణ చూస్తుంది. నా కొడుకు ఉన్నాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజ్ పక్క నుండి వెళ్తుంటే అమ్మ అని అపర్ణని అనగానే అపర్ణ మురిసిపోతుంది. ఆయన వాళ్ళ అమ్మని గుర్తు పట్టారా అని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



