సంక్రాంతికి బిగ్ బాస్ పృథ్వి, విష్ణుప్రియల పెళ్లి జరగబోతుందా!
on Jan 7, 2026

బిగ్ బాస్ లో క్యూట్ లవ్ జోడి ఎవరు అంటే పృథ్వి శెట్టి - విష్ణుప్రియ అనే చెప్తారు. ఐతే పృథ్వి ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. అందులో హోస్ట్ "మీరు సంక్రాంతిని ఎంజాయ్ చేస్తూ ఉంటారా..తెలుసా మీకు " అని అడిగింది. "సంక్రాంతి తెలుసు. ఫెస్టివల్ అంటే వెజ్ ఉంటుంది" అన్నాడు. "ఐతే పృథ్వికి మన సంక్రాంతి గురించి ఏమీ తెలీదు. అమ్మ విష్ణు ఈ సంక్రాంతికి మన పృథ్విని పిలిస్తే మన సంక్రాంతి ఎలా ఉంటుందో చూపిద్దాం" అంది. "సంక్రాంతికి వస్తున్నాం" అంటూ పృథ్వి చెప్పుకొచ్చాడు.
'ఏయ్ కొత్త అల్లుడు సంక్రాంతికి వచ్చాడోయ్" అంటూ హోస్ట్ చప్పట్లు కొట్టింది. "అది నా పిల్లరా" అనేసరికి లైవ్ లోనే ఫోన్ మోగింది. తీసి చూస్తే ఇంకెవరు విష్ణుప్రియ కాల్ చేసి హిందీలో పాటలు పాడేసింది. మధ్యలో పృథ్వి "సంక్రాంతి ఎప్పుడురా" అని విష్ణుని అడిగాడు. "ఎందుకురా నన్ను పెళ్లి చేసుకుంటున్నావా" అని అడిగింది. "ఓకే సరే ఎక్కువ మాట్లాడొద్దుల్లే" అన్నాడు పృథ్వి. దాంతో విష్ణు "ఎందుకురా నాతో లవ్ లో పడిపోతావా" అని అడిగేసింది. "ఇప్పుడు మన విష్ణు వచ్చి పృథ్వి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటే ఎం చెప్తారు" అంది. "వద్దమ్మా నువ్వు మంచోడిని చూసి పెళ్లి చేసుకో" అంటాను అని చెప్పాడు పృథ్వి. బిగ్ బాస్ సీజన్ 8 లో విష్ణు ప్రియా - పృథ్వి లవ్ ట్రాక్ తో అప్పట్లో రేటింగ్ కూడా బాగా వచ్చింది ఈ షోకి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



