ENGLISH | TELUGU  
Home  » TV News

బిగ్ బాస్ సీజన్-7లో కామన్ మ్యాన్ ఎవరు?

on Apr 11, 2023

టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో కి ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఇప్పటికే బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే గత సీజన్-6 పూర్తి అయి నాలుగు నెలలు కావస్తుంది. కాగా సీజన్ 7 ఎప్పుడు మొదలవుతుందంటూ బిగ్ బాస్ ని ఇష్టపడే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుండగా.. ఈ సారి కంటెస్టెంట్స్ గా ఎవరిని తీసుకుంటున్నారన్నది అందరిలో ఉన్న క్వశ్చన్. కాగా గత సీజన్ లో పాపులారిటీ లేని కంటెస్టెంట్స్ ని ఎక్కువగా తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

బిగ్ బాస్- 7 కి సంబంధించిన కంటెస్టెంట్స్ చాలా వరకు ఓకే అయినట్లు సమాచారం. ఇందులో ఒక రియల్ కపుల్ కి అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాదిలో పెళ్లి అయిన ఇద్దరు సీరియల్ యాక్టర్స్ అమర్, తేజస్విని బిగ్ బాస్ సీజన్-7 కి ఎంపిక అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత సీజన్ లో కామన్ మ్యాన్ కేటగిరిలో ఆదిరెడ్డిని తీసుకున్నట్లుగా.. ఈ సారి కామన్ మ్యాన్ కేటగిరిలో ఇద్దరికి అవకాశం కల్పిస్తున్నట్లుగా సమాచారం. కాగా గత నెల రోజులుగా సోషల్ మీడియాలో మారు మ్రోగుతున్న పేరు పల్లవి ప్రశాంత్. ఇతను ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన రైతు. బిగ్ బాస్ లోకి ఎలాగైనా వెళ్తానంటూ.. మీ సపోర్ట్ కావాలని పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో  చెప్తున్నాడు. అలాగే చాలా మందితో ప్రమోషన్ చేస్తూ కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ లోకి వెళ్లడం తన కల అంటూ చెప్పుకొచ్చాడు. మరి కామన్ మ్యాన్ కేటగిరీలో ఈ కామన్ మ్యాన్ కి అవకాశం వస్తుందో లేదో చూడాలి. ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ప్రశాంత్ కి పలువురు నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్-7 హోస్ట్ గా ఇప్పటి వరకు చాలా మంది స్టార్స్ పేరు వినిపించినా.. గత నాలుగు సీజన్ల నుండి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి బిగ్ బాస్ యాజమాన్యం హోస్ట్ గా, కంటెస్టెంట్స్ గా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.
 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.