Bigg Boss 9 Telugu Bharani Elimination: భరణి ఎలిమినేషన్.. సూపర్ ట్విస్ట్!
on Dec 14, 2025

బిగ్ బాస్ సీజన్-9 లో పద్నాలుగో వారం పూర్తయింది. నిన్నటి ఆదివారం నాటి ఎపిసోడ్ లో డబుల్ ఎలిమినేషన్ అయింది. ఇందులో భరణి ఎలిమినేటెడ్ అయ్యాడు. నిన్నటి ఎపిసోడ్ లో డీమాన్ పవన్ థర్డ్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఇక ఎలిమినేషన్ రౌండ్ సంజన మరియు భరణి మధ్య సాగింది. పక్షి రెక్కల్లో లిమినేషన్, ఫైనలిస్ట్ బోర్డ్‌లు ఉన్నాయి. వాటిని లాగాలని చెప్పడంతో భరణి వైపు ఎలిమినేషన్ ఉండగా.. సంజన వైపు ఫైనలిస్ట్ అని ఉంది. దాంతో భరణి ఎలిమినేట్ కాగా సంజన ఫైనలిస్ట్ అయ్యింది. భరణి ఎలిమినేషన్ కాగానే తనూజ ఎమోషనల్ అయింది.
ఇక సంజన అయితే పాజిటివ్ గా మాట్లాడింది. ఇక అందరికి బై చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చేశాడు భరణి. ఇక భరణి జర్నీ వీడియోలో తనూజ, దివ్య ఇద్దరు మాత్రమే ఉన్నారు. సరే అయితే వెళ్లే ముందు వాళ్ల గురించి ఓ మంచి మాట చెప్పేసి వెళ్లమని నాగార్జున అనగానే అందరు ఫైటర్స్ అని చెప్పాడు నాగార్జున.
ఇక అందరి గురించి రేలంగి మావయ్య లాగా బానే చెప్పాడు. డీమాన్ పవన్ స్ట్రాంగ్ అతడి డ్రీమ్స్ నెరవేరాలని భరణి చెప్పుకొచ్చాడు. సెల్యూట్ టూ సైనికా అని కళ్యాణ్ తో భరణి అన్నాడు. ఇక తనూజ గురించి చెప్తుండగా.. ఒకే టైమ్ అయిపోయింది.. ఎడిట్ లో లేపేస్తారు.. వెళ్దాం పదా అని నాగార్జున అనగా.. సర్ తనూజ గురించి మాట్లాడినా ఎడిట్ చేస్తారా అని భరణి ఆశ్చర్యపోయాడు. జోక్ చేశానని నాగార్జున అన్నాడు.
తనూజా.. నిన్ను బాధపెట్టాను.. వేరే వాళ్లతో క్లోజ్‌గా ఉన్నా నీకు ఇచ్చే విలువ నీకు ఇచ్చాను. దానికి బాండింగ్ అని పేరు పెట్టినా వేరే పేరు పెట్టినా కూడా నా ఆట నేను ఆడుకుంటూనే ఉన్నాను. సారీ.. ఇక తనూజకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు భరణి. అందరికి బై చెప్పేసి హౌస్ నుండి బయటకు వచ్చేశాడు భరణి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



