టాప్-5 లో ఉండే అర్హత లేదన్న రతిక!
on Nov 29, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో రెండుసార్లు హౌస్ లోకి ఎలిమినేట్ అయి వచ్చిన రతిక బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది.
రెండో సారి వచ్చిన అవకాశాన్ని వాడుకోలేదని అనుకున్నాం మీరేమంటారని యాంకర్ అడుగగా.. అవును. గేమ్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేకపోయాను. యాక్టివిటీల పరంగా చిన్నప్పటి నుండి నేను వీక్. నాకు ప్రేక్షకులు బాగా సపోర్ట్ చేశారు. మొదటి సారి ప్రశాంత్, శివాజీలతో మాట్లాడకుండా బయటకు వచ్చేశారు ఎందుకని అడుగగా.. రతిక యూ ఆర్ ఎలిమినేటెడ్ అనగానే నా మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయింది. ఏం మాట్లాడాలో కొద్దిసేపు తెలియలేదు. బయటకు వచ్చాక కొన్ని విషయాలు తెలిసి బాధపడ్డానని, అందుకే లోపలికి వెళ్ళగానే ఇద్దరికి సారీ చెప్పానని రతిక అంది. హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చాక ఎందుకో మీరు డల్ అయినట్టు అనిపించిందని యాంకర్ అడుగగా.. రెండో వారం యావర్ తో జరిగిన విషయాలని హౌస్ లోకి వెళ్ళాక చెప్పాను. అవి తీసుకొని నామినేషన్ లో అమర్ దీప్ కి చెప్పి నామినేట్ చేశాడు. ఇక బొమ్మల టాస్క్ లో గొడవ ఎందుకని అమర్ దీప్ ని బ్రతిమిలాడాను కానీ అతను వినలేదు.
కెప్టెన్సీ టాస్క్ లో అమర్ దీప్ కి కాకుండా ప్రియాంకకి సపోర్ట్ చేశారెందుకని యాంకర్ అడుగగా.. అతడికి సపోర్ట్ చేయకపోవడానికి రీజన్ ఉంది. అమర్ దీప్ నన్ను పర్సనల్ గా రెండు, మూడు మాటలు అన్నాడు. అవి చాలా భాదేశాయని అంది. యావర్ తో మళ్ళీ లవ్ ట్రాక్ ఎందుకు మొదలెట్టారని యాంకర్ అడుగగా.. నేను కావాలని చేయలేదు. 2.0 లో లోపలికి వెళ్ళిన వాళ్ళు నా గురించి నెగెటివ్ గా చెప్పారు. అయిన నా విషయాలు వాళ్ళకెందుకని రతిక అంది. టాప్-5 లో ఉంటావని అనుకున్నావా అని యాంకర్ అడుగగా.. టాప్-5 లో ఉండే అర్హత నాకు లేదు. తర్వాతి వారం బాగా ఆడతానని చెప్పడం ప్రతీ వారం చెప్పడం సరకాదని అనిపించింది. ప్రశాంత్ విషయంలో నేను చేసింది తప్పు అని అంగీకరిస్తున్నాని అంది. టాప్-5 లో శివాజీ, ప్రశాంత్ ఉంటారని అనుకుంటున్నాను. నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రేక్షకులకి సారీ అనే చిన్నమాట చెప్పి వారిని మభ్యపెట్టలేనని రతిక అంది. ఇలా కొన్ని ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసుకుంది రతిక.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
