బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ లాంచ్!
on Sep 5, 2022

గత కొంత కాలంగా తెలుగు టీవి రంగంలో అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతున్న షో "బిగ్ బాస్". మొదటి సీజన్ హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ చేయగా, రెండవ సీజన్‌కు నాని హోస్ట్ గా చేసాడు. ఆ తర్వాత నాలుగు సీజన్ల నుండి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నాడు. బిగ్ బాస్ చూసే వారిలో కొందరూ టీవీకి అతుక్కుపోయినట్టు చూసేవారు ఐతే, మరికొందరు ఇది కూడా ఒక షోనేనా అనేవాళ్ళు లేకపోలేదు. ఐతే ఈ సారి భారీ అంచనాలతో అత్యధిక ఖర్చుతో ఇరవై మంది కంటెస్టెంట్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చినవాళ్ళు.. కీర్తి భట్ (సీరియల్ యాక్టర్), సుదీప (యాక్టర్), శ్రీహాన్ (యాక్టర్, సోషల్ మీడియా ఆక్టివిస్ట్), బాలాదిత్య (యాక్టర్), మరీనా అబ్రహాం - రోహిత్ సాహి (సీరియల్ కపుల్స్ ), చలాకి చంటి (కమెడియన్), ఆరోహీ రావ్ (టీవి యాంకర్), నేహా చౌదరి (వీడియే జాకీ, రిపోర్టర్), ఆది రెడ్డి (యూట్యూబర్ ), ఆర్జే సూర్య, శ్రీ సత్య (నటి), గీతూ రాయల్ (రివ్యూ రైటర్), వసంతి క్రిష్ణన్, అభినయశ్రీ (యాక్టర్), ఫైమా (కమెడియన్), అర్జున్ కళ్యాణ్ (యాక్టర్), షాన్ (యాక్టర్), ఇనయ సుల్తానా (యాక్టర్), రేవంత్ (సింగర్).
ఈ షోలో కొందరు కంటెస్టెంట్‌లకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఐతే దీనిని స్ర్కిప్ట్ అని కొందరూ, రియాలిటీ అని కొందరూ అంటున్నారు. ఈ షో మూడు నెలల పాటు కొనసాగుతుంది. చివరి వరకూ ఉండి బాగా ప్రతిభను చూపిన ఒక్కరిని విన్నర్ గా ప్రకటిస్తారు. విన్నర్ కి యాభై లక్షలు ప్రైజ్ మనీ ఇస్తారు. ఈ ఇరవై మందిలో విన్నర్‌గా నిలిచి, ఆ క్యాష్ ప్రైజ్ అందుకునేది ఎవరనేది ఆసక్తిని రేకెత్తిస్తోన్న విషయం. ఇక ఈ షో లో ఒక్కొక్కరు ఎలా ప్రవర్తిస్తారో, ఎవరు మెప్పిస్తారో, ఎవరు నొప్పిస్తారో చూడాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



