బిగ్ బాస్ లోకి వీళ్ళు దాదాపు కంఫర్మ్ ఐనట్టే ?
on Jul 17, 2025

బిగ్ బాస్ సీజన్ 9 కి అంతా సిద్ధమవుతోంది. కంటెస్టెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు వీళ్ళు అంటూ చాలా మంది నేమ్స్ వినిపిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో కూడా వాళ్ళ వాళ్ళ పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి. ఐతే ఇప్పటివరకు సింగర్ శ్రీతేజ, డైరెక్టర్ పరమేశ్వర్, చిట్టి పికిల్స్ రమ్య, యూట్యూబ్ ఇన్ఫ్లూఎన్సర్ బబ్లు వీళ్ళు ఫైనల్ అయ్యారంటూ తెలుస్తోంది. ఇక నవ్య స్వామి, వర్షిణి, రీతూ చౌదరి, ఇమ్మానుయేల్, హీరో రాజ్ తరుణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటూ తెలుస్తోంది. సింగర్ శ్రీతేజ ఎక్కువగా పోడ్ క్యాస్ట్స్ చేస్తూ ఉంటారు.
ఈయనొక సింగర్, యాంకర్, ఇంటర్ప్రెన్యూర్ గా ఉన్నారు. ఇక యాక్టర్, డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే గురించి చెప్పాలంటే ఆయన అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా స్టూడెంట్స్ తీసిన 2015 లో వచ్చిన "చిరు గొడవలు" మూవీతో ఎంట్రీ ఇచ్చారు. 2016 లో కుమారి 18 +, 2017 లో లావణ్య విత్ లవ్ బాయ్స్, 2021 లో జాతీయ రహస్యం, 2022 లో దారి వంటి మూవీస్ లో నటించారు. ఇక గుమ్మడి నరసయ్య బయోపిక్ ని ఆయన డైరెక్ట్ చేశారు. గుమ్మడి నరసయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి ఐదు సార్లు ఎంఎల్ఏగా ఎన్నికైన గిరిజన నాయకుడు. ఇక చిట్టి పికిల్స్ రమ్య గురించి చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో నెగటివ్ గా ట్రోల్ ఐన త్రి సిస్టర్స్ లో రమ్య ఒక అమ్మాయి. యూట్యూబర్ బబ్లు అటు మూవీస్ లో ఇటు షార్ట్ ఫిలిమ్స్ అలాగే బుల్లితెర మీద రకరకాల షోస్ లో కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. వెళ్లంటే దాదాపు సెలెక్ట్ ఐనట్టు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



