గుర్రం మీద మహారాణిలా వద్దామనుకున్నా.. చిత్తూర్ చిరుత ఎమోషనల్ పోస్ట్ వైరల్!
on Nov 10, 2022
.webp)
గలాటా గీతూ బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు ఆడి అందరిలో నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుని ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది. తర్వాత పర్సనల్ గా కొన్ని వీడియోస్ చేసింది. ఎన్నో ఇంటర్వూస్ కూడా ఇచ్చింది.
ఇక ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో చాలా ఎమోషనల్ లైన్స్ పెట్టుకుని బాధపడుతోంది. "నా జీవితంలో ఇది చాలా అందమైన జర్నీ..కానీ చాలా ఎమోషనల్ గా పూర్తి అయ్యింది. నా ఎగ్జిట్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నాను...ఒక గుర్రం మీద మహారాణి లాగా వద్దామని అనుకుని కలలు కన్నాను. ఇంత దారుణంగా అవుతుంది అని అస్సలు అనుకోలేదు. బిగ్ బాస్ లో నా ప్రాణం పెట్టి ఆడాను. ప్రాణాలేపోయినంత బాధలో తిరిగొచ్చేశాను. చాలా ఎక్కువగా ఆశపడ్డాను, ఆవేశపడ్డాను అని హౌస్ నుంచి బయటికి వచ్చాక అర్ధమయ్యింది. నా నుంచి మీరు రెండు మోరల్స్ నేర్చుకోవాలి. ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకూడదు..అలాగే మన మాటే కాకుండా అప్పుడప్పుడు ఇతరుల మాట కూడా వినాలి అని.
బిగ్ బాస్ మీద ఎంతో ప్రేమ ఉన్నా అందులో ఓడిపోయాను. మీరు నా మీద పెట్టుకున్న ప్రేమలో ప్రాణంపోయినా మిమ్మల్ని ఓడిపోనివ్వను.. ప్రామిస్" అంటి ఒక పోస్ట్ పెట్టింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



