Bigg boss 9 Telugu Nominations: రెండో వారం నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే!
on Sep 18, 2025
.webp)
బిగ్ బాస్ సీజన్-9 మొదలై అప్పుడే వారం పూర్తయింది. మొదటి వారం శ్రష్టి వర్మ ఎలిమినేషన్ అయిన సంగతి తెలిసిందే. ఇక రెండో వారం హోరాహోరీగా నామినేషన్ల ప్రక్రియ సాగింది. దీనిలో కామనర్స్ అంతా కలిసి వారందరికి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని భావించిన భరణిని నామినేట్ చేశారు. అయితే మాస్క్ మ్యాన్ హరీష్ మాత్రం ఒక సైకోలా మారిపోయి.. ఎవరితో పడితో వారితో గొడవ పెట్టుకుంటున్నాడు.
ఆదివారం రాత్రి మొదలైన రెండో వారం నామినేషన్ ప్రక్రియలో దాదాపు ఇంటి సభ్యుల టార్గెట్ చేశారు. రీతూ చౌదరీ, భరణి, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్, ఇతర కంటెస్టెంట్లతో పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకుంది. దాదాపు నలభై ఎనిమిది గంటలపాటు సాగిన ఈ ప్రక్రియ గందరగోళం మధ్య ముగిసింది. రీతు చౌదరి, మాస్క్ మ్యాన్ హరీష్ మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత దమ్ము శ్రీజ, హరీష్ కి, భరణికి డీమాన్ పవన్ కి, భరణికి పవన్ కళ్యాణ్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. మాస్క్ మ్యాన్ హరీష్ మాటతీరు, బిహేవియర్ చాలా వరెస్ట్ గా ఉందంటూ.. మాతో ఉండటం ఇష్టం లేకుంటే వెళ్ళిపోవచ్చు కదా అని దమ్ము శ్రీజ అనగా.. మీకు దమ్ముంటే నన్ను వెళ్ళిపోమని బిగ్ బాస్ తో చెప్పండి అంటూ మాస్క్ మ్యాన్ హరీష్ అన్నాడు. అందరిలో దమ్ము ఉందా అని దాని గురించి మాట్లాడొద్దని రీతూ చౌదరి, తనూజ విరుచుకుపడ్డారు.
నిన్న జరిగిన నామినేషన్లో కామనర్స్ దమ్ము శ్రీజ, మర్యాద మనీష్, డీమాన్ పవన్, పవన్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్ హరీష్ అంతా కలిసి భరణిని టార్గెట్ చేసి ఓటింగ్ చేశారని ఆడియన్స్ కి క్లియర్ గా తెలిసింది. మాస్క్ మ్యాన్ హరీష్ ఓ అడుగు ముందుకేసి.. భరణి అందరితో నామినేషన్ డిస్కషన్ చేశాడని చెప్పాడు. ఇంకా సిల్లీ రీజన్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ ని నామినేట్ చేసిన హరీష్. ఆడవాళ్లు, మగవాళ్ళు సమానం.. కానీ మీరు అలా లేరు అంటూ ఇమ్మాన్యుయల్ ని హరీష్ నామినేట్ చేశాడు. ఇక ఆ మర్యాద మనీష్ అయితే పెద్ద తోపులాగా భావించి భరణిని నామినేట్ చేశాడు. అతను చెప్పిన రీజన్లు ఒక్కటంటే ఒక్కటి కూడా వ్యాలిడ్ లేవు.. ఇలా చిత్ర విచిత్ర రీజన్లతో కామనర్స్ అయినటువంటి దమ్ము శ్రీజ, ప్రియ, మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్, డీమాన్ పవన్, పవన్ కళ్యాణ్ నామినేట్ చేశారు. ఇక వీళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి అసలు సంబంధం లేకుండా పోయింది. బిగ్ బాస్ సీజన్-9(Bigg boss 9 Telugu Nominations) రెండో వారం నామినేషన్ల ప్రక్రియ అతి కష్టం మీద ల్యాగ్ ఎపిసోడ్ లతో పూర్తయింది. రెండో వారం మాస్క్ మ్యాన్ హరీష్, సుమన్ శెట్టి, దమ్ము శ్రీజ, మర్యాద మనీష్, భరణి, పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్ నామినేషన్ లో ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



