దమ్మున్న ప్లేయర్, దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ ఎవరంటే!
on Dec 1, 2024

బిగ్ బాస్ సీజన్-8 పదమూడో వారం వీకెండ్ లో నాగార్జున వచ్చీ రాగానే అవినాష్ ఈజ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత హౌస్ లోని కంటెస్టెంట్స్ కి బ్లాక్ టికెట్, గోల్డెన్ టికెట్ ఇచ్చాడు నాగార్జున.
మొదటగా నిఖిల్ ని అడుగగా టేస్టీ తేజకి బ్లాక్ టికెట్ ఇచ్చాడు. గౌతమ్ ని అడుగగా.. అతిథులు బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తే వారితో సరిగ్గా ప్రవర్తించలేదని ప్రేరణకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రేరణ ఫౌల్ గేమ్ ఆడిన వీడియోని ప్లే చేసి చూపించాడు. పృథ్వీ ఫౌల్ గేమ్ ఆడాడంటూ అందుకే అతనికి బ్లాక్ టికెట్ ఇచ్చింది రోహిణి. నబీల్, విష్ణుప్రియ, తేజకి బ్లాక్ టికెట్ ఇచ్చాడు అవినాష్. గౌతమ్ కి బ్లాక్ టికెట్ ఇవ్వాలని ప్రేరణ అంది. ఇక తనకి మద్దతుగా నబీల్, విష్ణుప్రియ, పృథ్వీ చేతులు లేపారు. అప్పటి వరకు అందరికి బ్లాక్ టికెట్ ఇచ్చుకుంటు పోయిన నాగార్జున.. గౌతమ్ కి గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అవినాష్, రోహిణి, నిఖిల్ కి గోల్డెన్ టికెట్ ఇచ్చాడు.
ఆ తర్వాత హౌస్ లో దమ్మున్న కంటెస్టెంట్? దుమ్ముదుమ్మయిపోయే కంటెస్టెంట్ ఎవరని అడిగాడు నాగార్జున. గౌతమ్ దమ్మున్న ప్లేయర్ అని రోహిణి అంది. ఎంటర్‌టైనర్స్ కూడా గెలుస్తారని నిరూపించాడంటు అవినాష్ కి తేజ దుమ్మున్న ప్లేయర్ ఇవ్వగా విష్ణుప్రియ దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ అని చెప్పాడు. నిఖిల్ దమ్మున్న ప్లేయర్ అని నబీల్, పృథ్వీ, విష్ణుప్రియ చెప్పారు. అలాగే తేజ దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ అని చెప్పారు. రోహిణి దమ్మున్న ప్లేయర్, ప్రేరణ దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ అని గౌతమ్ చెప్పాడు. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, పృథ్వీ ఫౌల్ గేమ్స్ ఆడతాడంటూ అతడికి దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ అని అవినాష్ చెప్పాడు . నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ అని ప్రేరణ, నిఖిల్ చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



