రాజ్ కి కావ్య సేవలు.. అపర్ణ చీవాట్లు!
on Apr 16, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -71 లో.. రాజ్ సబ్బుపై కాలు వేసి జారిపడగా కావ్య వాళ్ళు తనని తీసుకొచ్చి బెడ్ పై పడుకోపెడతారు. ఆ తర్వాత రాజ్ కి కావ్య మార్దన చేస్తుంది. అనంతరం హాట్ బ్యాగ్ అంటూ ఇత్తడి చెంబులో వేడి నీళ్లు తీసుకొని వస్తుంది కావ్య. దానిని చూసి రాజ్ భయపడతాడు. ఏంటిది అని అడుగగా.. మీరు అయితే హాట్ బ్యాగ్ వాడతారు. మేము వేడి నీళ్లు చెంబులో వేసి కాపడం పెడుతామని అప్పు అంటుంది. వేడి నీళ్ల చెంబు ఒంటిపై పెట్టగానే రాజ్ అరుస్తాడు. అరవకండి పొరపాటున ఆ వేడి నీళ్లు మీదపడితే మళ్ళీ బొబ్బలు వస్తాయి.. మళ్ళీ అదో మంటని అప్పు అంటుంది. రాజ్ అరవడంతో మీనాక్షి, కనకంలు వస్తారు. ఏమైందని అడుగుతారు. చాలా నొప్పి ఉన్నట్లు ఉంది.. ఈ కషాయం అందరం తాగిద్దామని అప్పు అంటుంది. ఇక అందరూ కలిసి రాజ్ కి కషాయం తాగిస్తారు. ఏంటిది కడుపులో ఏదో రకంగా ఉందని రాజ్ అనగా.. అది అంతే అని కనకం వాళ్ళు అంటారు.
ఆ తర్వాత రాజ్ ని చూసి.. మీ అమ్మకి ఇక్కడికి పంపించడం ఇష్టం లేదు.. ఇప్పుడు ఇలా దెబ్బ తగిలిందని తెలిస్తే అస్సలు ఊరుకోదు.. పైగా చెప్పలేదని అంటుంది. ఆవిడకి ఎలాగైనా చెప్పాలనుకుంటుంది కావ్య. మరోవైపు రాజ్ గురించి ఆలోచిస్తుంటుంది అపర్ణ. వాడు మారిపోయాడు.. మమ్మీ మళ్ళీ కాల్ చేస్తానని అన్నాడు. ఇంత వరకు చెయ్యలేదని అనుకుంటుండగా.. రాజ్ ఫోన్ నుండి కావ్య చేస్తుంది. నేను మీ కావ్యని అని కావ్య అనగానే.. నువ్వు నాకు ఫోన్ చేస్తావా.. రాజ్ ఫోన్ నీ దగ్గర ఎందుకు ఉందని అపర్ణ అడుగుతుంది. మీ అబ్బాయి జారిపడ్డాడు.. నడుము పట్టేసిందని కావ్య చెప్తుంది. దాంతో అపర్ణకి కోపం మరింత పెరుగుతుంది. కావ్యని బాధపడేలా మాట్లాడుతుంది అపర్ణ. అందరూ కలిసి వాడిని పంపించారు. ఇప్పుడు ఏమైందని అపర్ణ ఇంట్లో వాళ్ళతో అంటుంది. ఇక రాజ్ ని తీసుకురావడానికి అపర్ణ, రుద్రాణిలు.. కనకం వాళ్ళింటికి బయలుదేరుతారు. మరోవైపు రాజ్ ఉన్న గదిలో దోమలు ఎక్కువగా ఉండడంతో.. అప్పు దోమలతెరని తెచ్చి కడుతుంది. ఏంటిది నన్ను బంధిస్తున్నావా, తీసేయ్ అని రాజ్ అంటాడు. దోమలు మిమ్మల్నే కుడతాయంటూ చెప్పేసి అప్పు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కనకం వచ్చి.. రాజ్ గదిలో దోమల చక్రం పెడుతుంది. ఏంటిది అలా పొగలు వస్తుందని రాజ్ అడుగుతాడు. ఇది దోమలు రాకుండా చేస్తుందని కనకం అంటుంది. ఆ తర్వాత కావ్య బయట కూర్చోండి గాలికి అంటుంది. దాంతో రాజ్ చిరాకు పడుతాడు. ఇంత ఇగో ఎందుకని చెప్పి రాజ్ చెయ్యిపట్టుకొని కావ్య తీసుకువస్తుంది.
మరోవైపు అపర్ణ, కృష్ణమూర్తి ఇంటి అడ్రెస్స్ ని దార్లో వెళుతున్న స్వప్నని అడుగుతుంది. ఆమెను చూసి రాజ్ వాళ్ళ అమ్మ అని గుర్తుపట్టిన స్వప్న తన మొహం కనిపించకుండా జాగ్రత్త పడుతుంది. అపర్ణతో పాటు ఉన్న రుద్రాణి హిందీలో కృష్ణ మూర్తి ఇంటి అడ్రెస్ ఎక్కడ అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



