అసిస్టెంట్ పై సీరియస్ అయిన సదా.. తను అలా చేసాడంట!
on Apr 28, 2024
అంతా మీరే చేశారు.. ఏదీ పట్టించుకోరు.. అన్నింటిని మర్చిపోతారు. భయం లేదంటూ తన ఆసిస్టెంట్ మీద సీరియస్ అయింది సదా. కాగా సదా సీరియస్ అయిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సదా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్ లో భాగంగా మొదట బిబి జోడికి జడ్జి గా వ్యవహరించగా.. ఇప్పుడు నీతోనే డ్యాన్స్ షోకి జడ్జిగా చేస్తోంది. అయితే 'సదా గ్రీన్ లైఫ్' అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి ఇందులో తన రెగ్యులర్ అప్డేట్ లని చెప్తూ పలు వ్లాగ్స్ చేయగా వాటికి అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా తన అసిస్టెంట్ మీద చేసిన ప్రాంక్ వీడియో వైరల్ గా మారింది. తను మేకప్ చేసుకోవడానికి క్యారీవాన్ లో నలుగురు అసిస్టెంటులు ఉన్నారు. అయితే వీరిలో రాకేష్ అనే అసిస్టెంట్ తన బొట్టుబిల్లల ప్యాకెట్లు ఎక్కడో పెట్టి మర్చిపోయాడని అంది. నిజానికి అవి మొదట కనపడలేదని, కాసేపు వెతికితే తన మరో లేడీ అసిస్టెంట్ కు దొరకగా దానిని జాగ్రత్తగా దాచేసి కాసేపు రాకేష్ ని ఆడుకున్నారంతా.. ఈరోజు ఎలాగైనా నాకు ఆ బొట్టుబిల్లలు కావాలి అంతే అంటు సదా చెప్పగా పాపం రాకేష్ షూటింగ్ స్పాట్ లోని క్యారీవ్యాన్, డస్ట్ బిన్ ఇలా అన్నీ వెతికాడు. చివరగా తనే దొరికాయని చెప్పగా రాకేష్ అప్పుడు మాములుగా అయ్యాడు. అప్పటిదాకా టెన్షన్ తో వెతికేసాడు. అయితే ప్రతీ షెడ్యూల్ లో ఏదో ఒకటి ఇలా మర్చిపోతున్నాడని.. ఇంకెప్పుడు తను మరచిపోకూడదని ఇలా చేసానంటు సదా చెప్తూ ఈ ప్రాంక్ చేసింది.
సదా జంతు ప్రేమికురాలు.. నేచర్ ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టంతో తను వీకెండ్స్ లో ఫారెస్ట్ కి వెళ్ళి తన ఫోటోగ్రఫీ స్కిల్స్ ని ఉపయోగిస్తుంది. ఎక్కువగా గ్రీనరిని ఇష్టపడుతుంది. సదా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా 'జయం' మూవీని చెప్పొచ్చు. జయం సినిమా వచ్చి దాదాపు 20 సంవత్సరాలు దాటినా అప్పటికి ఇప్పటికి తరగని అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది సదా. ఆ తర్వాత వచ్చిన అపరిచితుడు, ప్రియసఖి, సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళంలో కొన్ని సినిమాలని చేసింది. ఇక ఇప్పుడు యూట్యూబ్ లో తను చేసిన వ్లాగ్స్ అత్యధిక వీక్షకాధరణ పొందుతున్నాయి. మరి తను చేసిన ఈ ప్రాంక్ వ్లాగ్ ని మీరు కూడా చూసేయ్యండి.
Also Read