ఇప్పటికీ నేను గుర్తున్నానంటే దాని వల్లే...జబర్దస్త్ 500 వ ఎపిసోడ్ కి రోజా మాటలు!
on Dec 30, 2022
.webp)
నెక్స్ట్ వీక్ జబర్దస్త్ దుమ్ము రేపడానికి రెడీ ఐపోయింది. ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ అందించబోతోంది వచ్చే వారం ఎపిసోడ్. రీసెంట్ గా రిలీజ్ ఐన ఈ ఎపిసోడ్ ప్రోమో చూస్తే చాలు అర్థమైపోతుంది.
ఇక జబర్దస్త్ 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా రోజా ఈ షోకి వచ్చి ఎంటర్టైన్ చేశారు. టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆమె జబర్దస్త్ జడ్జి సీటు నుంచి తప్పుకున్నారు.
ఆ తర్వాత ఆమె ప్లేసులోకి ఇంద్రజ వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ రోజా రావడంతో కమెడియన్స్ అందరిలో కొత్త ఉత్సాహం కనిపించింది. ఆమె మీద పంచులు బాగా పేల్చారు. ఫైనల్ గా ఆమెను అందరూ కలిసి సత్కరించారు. ఇక రోజా మాట్లాడుతూ " నాతో పాటు చేసిన హీరోయిన్స్ ని ప్రేక్షకులు చాలామంది మరిచిపోయారు. నేను ఇప్పటి జనరేషన్ కి కూడా గుర్తు ఉన్నాను అంటే అది కేవలం జబర్దస్త్ వల్లే..థాంక్యూ" అని చెప్పారు. ఇంకా ఆమె మాటలకు స్టేజి మొత్తం ఈలలు, కేకలతో మారుమోగింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



