ENGLISH | TELUGU  
Home  » TV News

సన్నీని‌ గన్ తో కాల్చిన సప్తగిరి.. ప్రాణాపాయం తప్పిందా!

on May 18, 2023

 

విజే సన్నీ...బిగ్ బాస్ షోతో ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో అందరికి తెలిసిందే. బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ళాక అతడి ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ రావడంతో బిజీ అయ్యాడు. సన్నీ నటించిన 'ఏటీఎమ్' వెబ్ సిరీస్ ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ తన వ్యక్తిగత జీవితం గురించి, సినిమాల గురించి  కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

మీరు చేస్తున్న అన్ స్టాపబుల్ మూవీకి చెందిన ఏదైనా ఆసక్తికర ఘటన గురించి చెప్పండని ప్రశ్నించగా.. "నేను, సప్తగిరి, పృథ్విరాజ్ గారు ముగ్గురం వరుసగా నిలబడి ఉన్నాం.. ఒక డమ్మీ గన్ తో అలా షూట్ చేసినట్టుగా ఒక ప్రమోషనల్ వీడీయో చేద్దామనుకున్నాం.. అయితే అక్కడ ఉంది రియల్ గన్.. అది కూడా లోడేడ్ గన్ .. అయితే సప్తగిరి అన్న గురించి తెలిసిందే కదా.‌. మాములుగానే దీపావళి టపాసులు కాల్చినట్టు గన్ దొరికితే అలా కాల్చేస్తుంటాడు.

ఆ లోడెడ్ గన్ తీసుకొని అలా కాల్చగానే నా ఛాతి మీద ఆ గన్ పౌడర్ పడింది. దాంతో నన్ను వెంటనే క్యారీవ్యాన్ కి తీసుకెళ్ళి ట్రీట్‌మెంట్ చేసారు" అని సన్నీ వివరించాడు. మరి సప్తగిరి భయపడ్డాడా అని ప్రశ్నించగా.. అబ్బే అసలు భయమే లేదు.. హ్యాపీగా నవ్వుతున్నాడని సన్నీ అన్నాడు. మరి ప్రమోషన్స్ సంగతేంటని అడుగగా.‌. మేం ఒకరకంగా ప్రమోషన్స్ చేద్దామనుకుంటే అదో రకంగా బయటకొచ్చిందని సన్నీ అన్నాడు.

మీకు ఎవరి మీద అయినా క్రష్ ఉందా అని ప్రశ్నించగా.. నేను నా సిక్స్త్ క్లాస్ నుండి ఇష్టపడుతూనే ఉన్నాను సర్.. అలియాభట్ ని ఇష్టపడ్డాను కానీ చివరికి ఆమెకి పెళ్ళి అయింది. మీ లవ్ అలియాభట్ కి తెలియదు కదా.. మరి ఆమెకి చెప్పారా అని అడుగగా.. చంపేస్తారు సర్.. కొన్ని ఆశపడాలి కాని అత్యాశపడకూడదని సమాధానమిచ్చాడు సన్నీ.

మరి పెద్దవాళ్ళు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారా అని అడుగగా.‌.. ఎందుకు సర్ మానిపోయిన గాయాన్ని మళ్ళీ రేపుతున్నారని సమాధానమిచ్చాడు సన్నీ.‌ యాక్టింగ్ కోసం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తనకి ఒక్కరూ కూడా తెలియదంట.. చదువుకుంటూనే యాక్టింగ్ ఛాన్స్ కోసం ప్రయత్నించేవాడంట సన్నీ. అలా మూడేళ్ళ డిగ్రీని ఐదేళ్ళలో పూర్తి చేసాడంట సన్నీ. ఇలా తన సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితం గురించి కూడా షేర్ చేసుకున్నాడు‌ సన్నీ.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.