ఆ విరిచేసిన యాంటెనాల గురించి ఆంటీకి ఎందుకు చెప్పడం!
on Nov 23, 2022
.webp)
క్యాష్ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక రాబోయే వారం ఈ షోకి "ధమాకా" మూవీ టీమ్ వచ్చింది. శ్రీలీల, సమీర్, భీమ్స్, ప్రసన్నకుమార్, నక్కిన త్రినాధరావు వచ్చారు. ఐతే సమీర్ ని కలవడానికి ఆయన ఫ్రెండ్ ఎవరో వచ్చారు అని ఒక పండిపోయిన ముసలివాడిని స్టేజి మీదకు పిలిచింది సుమ. " చెప్పండి మీ జ్ఞాపకాలేమిటో" అని అతన్ని అడిగేసరికి "ఇండస్ట్రీకి రాకముందు నేను సమీర్ గారు యాంటెనాలను విరిచేసే వాళ్ళం...అని చెప్పేసరికి ...ఆ యాంటెనాల గురించి ఆంటీకి ఎందుకు చెప్పడం" అని సమీర్ కౌంటర్ వేసాడు.
దాంతో సుమకి ఏమనాలో తెలియక సైలెంట్ గా ఉండిపోయింది. ఇంతలో "మనం రాజీవ్ కనకాలను ఎత్తుకుని ఆడిపించాం..గుర్తుందా" అని ఆ ముసలాయన సమీర్ తో అనేసరికి "అవునవును రాజీవ్ కి సమీర్ కి ఇద్దరికీ 20 ఏళ్ళ తేడా ఉంది" అని కామెడీ చేసింది సుమ. "అప్పటికి నువ్వింకా పుట్టనే పుట్టలేదు..తెలుసా" అని ఆ ముసలాయన సుమ మీద కౌంటర్ పంచ్ వేసాడు. దాంతో సుమ "ఆమ్మో ఈయన అన్నీ నిజాలే చెప్తున్నాడు" అంది ఫన్నీగా. ఇక ఆ ముసలి వేషం వేసుకున్న అతను " నన్ను గుర్తుపట్టావా" అనుకుంటూ సమీర్ దగ్గరకు వచ్చేసరికి "నిన్ను గుర్తుపట్టాలి..అంతేకదా" అని అతని గడ్డాన్ని, జుట్టుని లాగేస్తాడు. అప్పుడు అసలు వేషం బయటపడుతుంది. అతను మరెవరో కాదు పటాస్ ప్రవీణ్. ఇక ప్రవీణ్ చేసిన కామెడీకి అందరూ ఫుల్ గా నవ్వేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



