Home

»

Tv News

Godhavari: శంకర్ నారాయణకు సింహాద్రి వెన్నుపోటు.. నందు ప్రవర్తనతో మురళి కన్నీరు!

May 28, 2026 10:52AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -15 లో... సింహాద్రి తన ఫ్రెండ్స్ తో డ్రింక్ చేస్తుంటాడు. ఆ శంకర్ నారాయణ తన కూతురుకి తోటని కట్నంగా ఇస్తానని అన్నాడు అని చెప్తాడు. త్వరలో అక్కడ ఇండస్ట్రీస్ రాబోతున్నాయంట.. రేటు పది రేట్లు పెరుగుతుందని సింహాద్రి ఫ్రెండ్స్ అంటారు. అవును.. ఆ తోట నాది అని సింహాద్రి అనగానే అందరు షాక్ అవుతారు. నిజమే ఆ తోటని నా పేరున నేనే కొన్నాను రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని సింహాద్రి చెప్తుంటే నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా నమ్మాడు కదా అని అక్కడ వాళ్ళు అంటారు. నాకు డబ్బు తప్ప ఏం అవసరం లేదని సింహాద్రి చాలా కఠినంగా మాట్లాడతాడు.

మరొకవైపు మనకి ఉంది ఒక్క కూతురు కదా.. మిగతా ముగ్గురు కూతుళ్ళ పెళ్లి చెయ్యాలంటే కష్టం అవుతుంది.. ఇచ్చిన మాట వెనక్కి తీసుకోండి అని శంకర్ తో శారద అంటుంది. ఏంటి ఏదో తోట మొత్తం రాసిస్తున్నట్లు అంటున్నారు.. సగమే కదా అని నందు అంటుంది. నేను ఏం చేసినా నా కూతుళ్ల కోసమే కదా అని శంకర్ అంటాడు. తన నలుగురు కూతుళ్లు వచ్చి హగ్ చేసుకుంటారు.ఆ తర్వాత సూర్య, మురళిని కోపంగా చూస్తాడు. ఏంటి బ్రో వచ్చినప్పటి నుంచి అలా చూస్తున్నావని సూర్య అడుగుతాడు. నువ్వు నన్ను నందుని కలుపుతానని చెప్పి నీ ఫ్రెండ్ ని తీసుకొని వచ్చి పెళ్లి సెటిల్ చేస్తావా అని మురళి కోపంగా మాట్లాడతాడు. వాడు నందుని చూడడానికి వస్తున్నాడని నాకు తెలియదు బ్రో అని సూర్య చెప్తాడు. తన ఫోన్ కి గ్రూప్ లో ఒక ఫోటో వస్తుంది. అది నందు, అరవింద్ ఫోటో.... అది మురళి చూసి బాధపడుతుంటే ఒకతను మందు భాటిల్ తీసుకొని వచ్చి ఇచ్చి తాగమని చెప్తాడు. దాంతో మురళి డ్రింక్ చేస్తాడు.

మరొకవైపు ఈ గౌతమి గ్రూప్ లో ఫోటో ఎందుకు పెట్టింది. అందులో బావ కూడా ఉన్నాడు బాధపడుతున్నాడేమోనని మురళికి జానూ ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ ని సూర్య లిఫ్ట్ చేసి మీ బావ ఇక్కడ డ్రింక్ చేస్తున్నాడని చెప్తాడు. వాళ్ళ అడ్రెస్ చెప్పండి దింపుతానుని సూర్య అనగానే మా అత్తయ్య గురించి మీకు తెలియదు.. నేను వస్తాను అప్పటివరకు అక్కడే ఉండండి అని జానూ చెప్తుంది. సూర్య సరే అంటాడు. తరువాయి భాగంలో మురళి దగ్గరికి నందు వచ్చి.. నీ షాప్ ముందు పెట్టిన ఫొటోస్ అన్ని తీసెయ్య్ మా ఆయన చూస్తే తప్పుగా అనుకుంటాడని అంటుంది. సరే అని మురళి అనగానే నీ మీద నమ్మకం లేదని నందునే అన్ని ఫోటోస్ కత్తెరతో కత్తిరిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com