.webp)
బుల్లితెర మీద ప్రియాంక జైన్ శివ్ కుమార్ జోడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నేళ్ల నుంచి ఈ జోడి ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంది. రీసెంట్ గ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో కూడా ఈ జోడి కనిపించింది. అలాంటి శివ్ రీసెంట్ గా కిస్సిక్ టాక్స్ షోకి వచ్చాడు. తన లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పి హోస్ట్ వర్షకి కూడా కన్నీళ్లు తెప్పించాడు. "మా నాన్న ఎలా అంటే మా అమ్మ స్కూల్ ఐపోయి పొరపాటున అరగంట లేట్ ఐనా కూడా గొడవ పడేవాడు. ఏంటి ఎవరితో తిరుగుతున్నావ్ అని. ఆ మెంటాలిటీని చూసి చూసి అలసిపోయాను. ఎందుకు మా నాన్న మా అమ్మను కొడతాడు. మా అమ్మ కూడా చూసి చూసి అలిసిపోయింది. నా చెల్లికి ఎలా ఐపోయింది అంటే అబ్బాయిలంటేనే విరక్తి పుట్టేసింది మా నాన్నను చూసి. ఆయన ఏ లెవెల్ ఎక్సట్రీమ్ కి వెళ్లిపోయారంటే అతను తాగుతాడు. చాలా అఫైర్స్ ఉన్నాయి..గుట్కా నములుతాడు. ఇదంతా నేను నా చెల్లి చూసినా కూడా ఆయనకేమీ ఉండదు. ఒక రోజు మా నాన్న జేబు లోంచి 20 రూపాయలు కనిపించలేదు. ఆయనే ఎవరికో ఇచ్చి తాగి ఏదో చేసాడు. కానీ అది ఆయనకు గుర్తు లేదు. నువ్వెందుకు తీసావ్ అని అరిచేసరికి ఆ ఊరంతా మా ఇంటికి వచ్చింది. జస్ట్ 20 రూపాయల కోసం అంత పెద్ద గొడవ చేసాడు. ఈ జీవితం వద్దు అంటూ మా అమ్మ నేను మా చెల్లి నాగరత్న అందరం కలిసి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోదామనుకుని అగ్గి పుల్ల వెలిగించబోయింది. మా అమ్మ వాళ్ళ స్టూడెంట్ వచ్చి మమ్మల్ని బయటకు తీసుకెళ్లిపోయారు. లేదంటే ఈరోజు శివ్ కుమార్ అనేవాడు ఎవరికీ తెలిసేది కాదు. ఎవరైనా మంచి నాన్నను చూసినప్పుడు అరె నాకు ఇలాంటి నాన్న ఎందుకు లేడా అనిపిస్తుంది. నాన్న ప్రేమ అనేది నాకు ఇప్పటి వరకు సరిగా దొరకలేదు...దొరకదు కూడా నాకు తెలిసి. కానీ నేను నీతో బాగా ఉండాలనుకుంటున్నా నాన్న ఐ లవ్ యు సో మచ్.. ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు ..ఇప్పుడు చెప్తున్నా . నేను నా నాన్న నుంచి మా అమ్మకు డివోర్స్ ఇప్పిస్తున్నా. ఆయన్ని ఫేస్ చేసినప్పుడల్లా అనిపించేది అమ్మా ఎందుకు ఆయనతో కలిసి ఉండడం డివోర్స్ ఇవ్వొచ్చు కదా అని కానీ ఇప్పుడు ఇప్పిస్తున్నా " అంటూ తన బాధను మాటల్లో కన్నీళ్లతో చెప్పాడు.





