ENGLISH | TELUGU  
Home  » TV News

వంద ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్!

on May 18, 2024


బుల్లితెర ధారావాహికల్లో స్టార్ మా సీరియల్స్ కి విశేషమైన ఆదరణ ఉంది. అందులోను‌ కొత్తగా మొదలైన 'ఎటో వెళ్ళిపోయింది మనసు ' సీరియల్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. ఈ సీరియల్ మొదలై సరిగ్గా వంద ఎపిసోడ్‌లు అయింది. దాంతో ఈ సీరియల్ మేకర్స్ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ‌ప్రోమో రిలీజ్ అవుతే చాలు.. గంటలోపే వేలల్లో వ్యూస్ వస్తాయి. అంతలా ఆకట్టుకుంటుంది ఈ సీరియల్ లో రక్ష నింబార్గి, సీతాకాంత్ ల ఆన్ స్క్రీన్ పర్ఫామెన్స్ కి ఆడియన్స్ ఫిధా అయ్యారనే చెప్పాలి. రోజుకో ట్విస్ట్ తో సాగే ఈ సీరియల్ లో మాణిక్యం, సిరి, ధన, శ్రీలత, సందీప్, అభి, రామలక్ష్మి, సీతాకాంత్ ఇలా అందరు తమ పాత్రలకి న్యాయం చేస్తున్నారు. గత జన్మలో ప్రేమించుకొని విడిపోయిన రామలక్ష్మి, సీతాకాంత్.. ఈ జన్నలోనైనా కలుస్తారా లేదా అనే కథాంశంతో మొదలైన ఈ కథ.. మొదటి ఎపిసోడ్ నుండి ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అందులోను ఇద్దరి భిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలు.. అయితే రామలక్ష్మికి ముందుగానే అభి అనే బాయ్ ఫ్రెండ్ ఉండటంతో కథలో మెలిక మొదలైంది. అభి వాళ్ళింటికి సీతాకాంత్ వెళ్ళి అక్కడ అన్నీ విషయాలు తెలుసుకుంటాడు.

ఇక అభికి గుణపాఠం చెప్పడానికి ఫేక్ కరెన్సీ నోట్లు ఇవ్వడం.. పోలీసులు అభిని  తీసుకెళ్ళడంతో కథ ఆసక్తికరంగా మారింది. ఇదే విషయాన్ని రామలక్ష్మికి అపరిచితురాలిగా శ్రీలత ఫోన్ చేసి చెప్తుంది. దాంతో సీతాకాంత్ కి రామలక్ష్మి చెప్తుంది. ఇక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగియగా.. ఆ అపరిచితురాలు ఎవరా అనే డౌట్ సీతాకాంత్ లో మొదలైంది. మరోవైపు అభి మోసగాడని రామలక్ష్మికి సీతాకాంత్ చెప్పగలడా లేదా అనేది ఉత్కంఠభరితంగా మారింది. ఇలా ఈ సీరియల్ ప్రస్తుతం వంద ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. ఈ సీరియల్ లో రక్ష నింబార్గి అమాయకత్వం , గంభీరంగా ఉండే సీతాకాంత్, కన్నింగ్ మెంటాలిటితో శ్రీలత, సందీప్ మెప్పిస్తున్నారు. 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.