ప్రభుదేవా ఎందుకు పనికి రాడు బ్రో అన్న నెటిజన్ కి నందు కౌంటర్
on Jun 27, 2025
బుల్లితెర మీద హోస్ట్ నందు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మల్టి-టాలెంట్ కి నిలువెత్తు అద్దం. ఢీ షోకి హోస్ట్ గా, అలాగే డాన్సర్ గా, మూవీస్ లో యాక్టర్ గా, క్రికెట్ కామెంటేటర్ గా ఇలా అన్ని రోల్స్ లో నందు తనదైన పెర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాడు. ఇక ఢీ న్యూ సీజన్ కోసం ఆల్రెడీ ప్రిపరేషన్ మొదలయ్యింది. దాంతో నందు కూడా డాన్స్ నేర్చుకుంటూ ఇరగదీసేస్తున్నాడు. రీసెంట్ గా ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. డాన్స్ నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి..అని నందు అడిగేసరికి...చాలా మంది చాలా కామెంట్స్ పెట్టేసారు.
ఇక నెటిజన్స్ ఐతే వేరే లెవెల్ లో కామెంట్స్ చేస్తున్నారు. ప్రతీ ఒక్క నెటిజన్ కి నందు ఆన్సర్ చేయడం మనం చూడొచ్చు.. కొన్ని కామెంట్స్ ఎలా ఉన్నాయంటే "ప్రభుదేవా ఎందుకు పనికి రాడు బ్రో అనే కామెంట్ కి షెడ్డుకు పంపేసేలా ఉన్నావు బ్రో అంటూ నందు రిప్లై ఇచ్చాడు. ఒకే ఇంట్లో సింగర్ అండ్ డాన్సర్ ఉన్నారు. మీరు ఢీ కంటెస్టెంట్ గా ఎందుకు చేయకూడదు ? అన్న ప్రశ్నకు ఎందుకంటే యాంకర్ గా చేస్తున్న కాబట్టి అన్నాడు. ఫస్ట్ టైం ఒక యాక్టర్ కామెంట్స్ కి రెస్పాండ్ కావడం..నందు ఆన్ ఫైర్, ఇండస్ట్రీ సూపర్ స్టార్, నిన్న ప్రాక్టీస్ ఈరోజు లైవ్..ఆసమ్, ఎందుకు ఇంత అందంగా పుట్టారు " అంటూ కామెంట్స్ చేశారు. ఇక సోమేష్ మాష్టర్ ఐతే సూపర్ అన్న అంటూ కామెంట్ పెట్టాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
