Illu illalu pillalu : మోసపోయిన ఆనందరావు.. నగలు శ్రీవల్లి దగ్గరే ఉన్నాయన్న ప్రేమ!
on Nov 29, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -328 లో.. నగలు ప్రేమనే తీసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తను పోలీస్ అవ్వాలని అనుకుంటుంది కదా.. ఆ ఖర్చులకి వాళ్ళు ఉపయోగించి ఉంటారని శ్రీవల్లి అంటుంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు అక్క.. నా నగలు నేను తీసుకోవడం ఏంటని ప్రేమ తనపై కోప్పడుతుంది. ఆ తర్వాత మీరు ఆపండి.. వల్లి మాటలు పక్కన పెట్టండి.. ఆ నగలు మీ దగ్గర ఉన్నాయా అని ప్రేమ, ధీరజ్ లని రామరాజు అడుగుతాడు.
మాకు తెలియదని వాళ్లు చెప్తారు. ఇప్పుడు ఈ నగల బాధ్యత మీదే.. ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు కానీ నగలన్నీ తీసుకొని రావాలని రామరాజు వాళ్ళకి చెప్తాడు. ఆ తర్వాత ఈ నగల వాళ్ళ ప్రశాంతత అనేది లేదు.. ఎందుకంటే మొదటి నుండి దీని గురించే గొడవ అని ప్రేమపై ధీరజ్ కోప్పడతాడు. అసలు నువ్వు వెళ్ళిన చోటుకి నేను వచ్చి ఉండకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదని ధీరజ్ అంటాడు. ఎన్నిసార్లు అంటావ్ రా అని ప్రేమ బాధపడుతుంది. ఇప్పుడు మనకి ఎక్కువ టైమ్ లేదు.. ముందు నగలు వెతకాలని ప్రేమ అంటుంది. మరొకవైపు ఆనందరావు, భాగ్యం ని ఒప్పించి ఒక దగ్గర డబ్బు ఇస్తాడు. సాయంత్రానికి రెట్టింపు ఇస్తానని చెప్పి మోసం చేస్తాడు. దాంతో భాగ్యం ఎక్కడ తిడుతుందోనని ఆనందరావు భయపడుతాడు.
మరొకవైపు అసలు నగలు ఎలా మాయమైయ్యాయని నర్మద, ప్రేమ ఆలోచిస్తారు. ఈ నగలు ఖచ్చితంగా వల్లి అక్క తీసింది అక్క.. ఎందుకు అంటే తిరుపతి బాబాయ్ నగలు తీసుకొని వెళ్లి వచ్చేవరకు టెన్షన్ పడుతూ గేట్ దగ్గరే ఉంది. వచ్చాక వాళ్ళు నగలు ఓపెన్ చేసి చూసారా అని అడిగిందని ప్రేమ అనగానే అయితే వెళ్లి తన రూమ్ లో చెక్ చేద్దామని నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



