అమ్మాయి నడుముని బట్టి అతను పాట చూసుకుంటాడన్న దీపిక!
on Apr 28, 2024
బ్రహ్మముడి సీరియల్లో కావ్యగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన దీపికా రంగరాజు. తన యూట్యూబ్ ఛానల్ రకరకాల వీడియోలను షేర్ చేస్తూ బిజీగా మారింది. బ్రహ్మముడి సీరియల్తో బాగా పాపులర్ కావడంతో.. దీపిక యూట్యూబ్ ఛానల్ అతి తక్కువ కాలంలోనే 97 వేల మంది సబ్ స్క్రైబర్స్ని సంపాదించింది దీపిక. ఇక యూట్యూబ్ ద్వారా మంచి ఇన్కమ్ జనరేట్ కావడంతో.. ఫుల్ ఫోకస్డ్గా తన యూట్యూబ్ ఛానల్లో బ్యూటీ, హెల్త్, పర్సనల్ ఇలా రకరకాల వీడియోలను షేర్ చేస్తుంది.
తాజాగా కావ్య తన యూట్యూబ్ ఛానెల్ లో " ఫన్ విత్ బ్రహ్మముడి ఫ్యామిలీ " అనే వ్లాగ్ చేసింది. దాంతో ఈ సీరియల్ అభిమానులతో పాటు నెటిజన్లు ఈ వీడియోని తెగ చూసేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్లాగ్ మూడు లక్షల వ్యూస్ ని దాటేసింది. ఇక సెట్ లో ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ.. ధాన్యలక్ష్మి ఆంటీకి చీరల పిచ్చి అని, గౌరీశంకర్ మామయ్యకి రీల్స్ చేయడం ఇష్టమని చెప్పింది. మా చిన్న మామయ్య అందరితో రీల్స్ చేస్తుంటాడు. ఎవరు కొత్తగా వస్తే వారితో రీల్ చేయడానికి చూస్తాడు. అమ్మాయి నడుముని బట్టి ఒక పాట, కళ్ళని బట్టి ఒక పాట డిసైడ్ చేసుకుంటాడని చెప్పింది దీపిక. ఇక అపర్ణ, కనకం ఇద్దరు కలిసి రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారని వారిద్దరు రీల్స్ పాట్నర్స్ అని దీపిక అంది. ఇలా సెట్ లో ఎవరేంటో? ఏం చేస్తారో ఒక్కొక్కరి గురించి చెప్పింది.
బ్రహ్మముడి సీరియల్ లో కావ్య రాజ్ ల జోడికి అభిమానులు కూడా ఎక్కువే. అయితే కావ్య తమిళ అమ్మాయి. తనకి ఈ సీరియలే మొదటిది. కానీ ప్రస్తుతం తను తెలుగు నేర్చుకుంటూ వ్లాగ్స్ తెలుగులోనే చేస్తుంది. ఇక ఢీ షోలో, స్టార్ మా పరివారం షోలో తన కామెడీతో అందరిని కడుపుబ్బా నవ్వించేస్తుంది. బ్రహ్మముడి సీరియల్ తో వచ్చిన గుర్తింపు కంటే కూడా వీకెండ్ లో వచ్చే స్పెషల్ షోలలో దీపిక కామెడీకి ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది.
Also Read