పెళ్లి చేసుకోబోతున్న శ్రీముఖి...ఫోన్ లో కౌంటర్ ఇచ్చిన మానస్ ఫియాన్సీ
on Sep 22, 2023
ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ లో శ్రీముఖి ఒక ఇంటరెస్టింగ్ కామెంట్ చేసింది. ఇక ఈ షోకి పాలేరు రోల్స్ లో వచ్చిన ఎక్స్ప్రెస్ హరిని, అవినాష్ ని చూసి "నేను అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను" అని సిగ్గు పడుతూ చెప్పింది శ్రీముఖి. దానికి అవినాష్ షాకయ్యాడు. అవినాష్ షాకింగ్ ఎక్స్ప్రెషన్ కి హరి కౌంటర్ ఇచ్చాడు. శ్రీముఖి చేసుకుంటాను అన్నది నిన్ను కాదు అన్నాడు. ఏదేమైనా శ్రీముఖి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాలాంటి యూత్ హర్ట్ అవుతారు అన్నాడు అవినాష్.
ఇక "సింగిల్స్ వెర్సెస్ కమిటెడ్" థీమ్ తో కొంతమంది ఫేమస్ సీరియల్ యాక్టర్స్ ని పిలిచింది. అందులో బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్, హీరోయిన్ దీపికా రంగరాజు వచ్చారు. ఇక మానస్ పెళ్లి గురించి శ్రీముఖి లొల్లి చేసింది. ఇక మానస్ గురించి దీపికా ఏం అనుకుంటోంది అని శ్రీముఖి అడిగేసరికి "మనసున ఉన్నది చెప్పేది కాదని" అంటూ బ్రేకప్ సాంగ్ పాడేసరికి అందరూ నవ్వేశారు. బాబోయ్ దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడు మానస్. ఇక పెళ్లి గురించి డాక్టర్ బాబు అలియాస్ పరిటాల నిరుపమ్ భారీ డైలాగ్ చెప్పాడు..."పెళ్లి అనేది ఇంటి భోజనం లాంటిది పెళ్లి చేసుకోండి" అని చెప్పాడు. తర్వాత మానస్ ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయితో శ్రీముఖి మాట్లాడింది " నీ పేరు పక్కన ఒక హార్ట్ పెట్టాడు..అదే నా పేరు పక్కన నాలుగు హార్ట్స్ పెట్టాడు" అని చెప్పేసరికి "నా చేతికి రింగ్ పెట్టాడు" అని అవతల నుంచి మానస్ ఫియాన్సీ రిప్లై ఇచ్చేసరికి శ్రీముఖి షాకయ్యింది. తర్వాత దీపికతో కలిసి సరదాగా గేమ్స్ ఆడించింది... ఫ్రీడమ్ దొరకలేదు అంటారు అంతా 1947 లో దొరికింది ఏంటి ఫ్రీడమ్ కాదా అని దీపికా అమాయకంగా చెప్పేసరికి అందరూ నవ్వేశారు...

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
