సిరి, చైతూల రాకతో క్యూట్ గా మారిన బిగ్ బాస్ ఎపిసోడ్!
on Nov 25, 2022
శ్రీహాన్ గర్ల్ ఫ్రెండ్ సిరి రావడంతో బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ నిండింది. వీళ్లిద్దరిని చూసి లవ్ బర్డ్స్ అని అనేవాళ్ళు చాలా మందే ఉన్నారు. గురువారం జరిగిన ఎపిసోడ్ లో సిరి రాకతో అట్రాక్షన్ లా ఉంది. యూత్ అంతా ఈ జంటని చూడటానికి చాలా ఉత్సాహంతో ఉన్నారని, సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తూనే తెలుస్తోంది. అయితే ఈ జంటతో పాటుగా వాళ్ళిద్దరు కలిసి దత్తత తీసుకున్న బాబు చైతు కూడా రావడంతో, శ్రీహాన్ ఆనందం రెట్టింపు అయ్యింది. హౌస్ మేట్స్ అందరి గురించి చైతు చెప్తుంటే శ్రీహాన్ మురిసిపోయాడు.
సిరి ఒక్కో హౌస్ మేట్ గురించి చెప్తూ పలకరించింది. "నీ సగం ఫుడ్ అంతా సత్యనే తింటున్నట్టుంది. ఇనయా..లేడి టైగర్ బాగా ఆడుతున్నావ్. హాయ్ కీర్తి ఏడపు మానేసావా, ఆదిరెడ్డి గారు, ఏది ఇప్పుడు అనండి. అయిందా..బాగా అయ్యిందా.. గేమ్ బాగా ఆడుతున్నారు. రాజ్, మనతో మినిమమ్ ఉంటుందా? ఇనయా ఏంటి ఈ మధ్య మావోడి మీద కాన్సంట్రేషన్ చేయట్లేదు" అని అందరి గురించి మాట్లాడింది సిరి.
ఆ తర్వాత సిరి, శ్రీహాన్ ఇద్దరు ప్రేమగా మాట్లాడుకున్నారు. "నువ్వు నాతో ఇన్ని రోజులు లేవు కదా కన్నా.. అందుకే నాతో ఉండాలి అని పచ్చబొట్టు వేసుకున్నా" అని సిరి అనగా, "లవ్ యూ రా కన్నా " అని శ్రీహాన్ అన్నాడు. ఆ తర్వాత టైం అయిందని బిగ్ బాస్ చెప్పడంతో సిరి, చైతులు బయటకు వెళ్లిపోయారు.