మంగళసూత్రంతో సురేఖావాణి.. రెండో పెళ్లి చేసుకుందంటూ ప్రచారం!!
on Oct 18, 2021
మొదట బుల్లితెరపై, తర్వాత వెండితెరపై రాణించిన తార సురేఖావాణి. తనదైన సొంత అస్తిత్వంతో, వ్యక్తిత్వంతో ముందుకు సాగుతూ, ముక్కుసూటిగా మాట్లాడే మనిషిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. అందచందాలు, అభినయ సామర్థ్యం కలిగిన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటారనే విషయం చాలామందికి తెలిసిందే.
2019లో సురేఖావాణి భర్త సురేశ్ తేజ అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తర్వాత కూడా ఆమె బోల్డ్‌గా కనిపిస్తూ రావడంపై సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేయడం, దానికి తనదైన శైలిలో ఆమె ధైర్యంగా సమాధానాలివ్వడం కూడా మనకు తెలుసు. కూతురు సుప్రీతతో కలిసి డాన్సులు చేస్తూ, వెకేషన్స్‌లో సరదాగా గడుపుతూ ఆమె చేసే పోస్టులు అభిమానులను అలరిస్తుంటాయి. కాగా ఇప్పుడు మెడలో మంగళసూత్రంతో ఉన్న ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆమె షేర్ చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె రహస్యంగా రెండో పెళ్లి చేసుకుందేమోనని కొంతమంది అనుమానం వ్యక్తం చేయగా, ఏదైనా సినిమా షూటింగ్లో భాగంగా మంగళసూత్రం ధరించిందేమోనని కొంతమంది భావించారు. అలాగే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' లోని హిట్ సాంగ్ "లెహరాయీ"కి చేసిన పర్ఫార్మెన్స్ వీడియోలోనూ ఆమె మంగళసూత్రంతో కనిపించారు. దీనిని కూడా ఆమె షేర్ చేశారు.
ఇదివరకు ఓసారి కూడా సురేఖావాణి సెకండ్ మ్యారేజ్ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే తను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాననే విషయంలో నిజం లేదని అప్పట్లో ఆమె తేల్చి చెప్పారు. కుమార్తె సుప్రీతతో కలిసి ఒంటరిగానే ఉంటున్నానని ఆమె స్పష్టం చేశారు. జీవిత భాగస్వామిని కోల్పోయి కూడా నిబ్బరంగా ఉంటూ, హుషారుగా కనిపించే సురేఖావాణిపై ఆమె తోటి నటులు ప్రశంసలు కురిపిస్తుంటారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
