తమిళ నటుడు శివకార్తికేయన్ తో సుడిగాలి సుధీర్ ని పోల్చిన శివబాలాజీ
on Jun 10, 2023
ఒక వైపు బుల్లితెర మీద మరో వైపు సిల్వర్ స్క్రీన్ మీద దూసుకుపోతున్నాడు సుడిగాలి సుధీర్..ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్ర'. అరుణ్ విక్కిరాల డైరెక్షన్ లో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కటూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. సుధీర్ కి జోడీగా 'డాలిశ్య' హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ‘కలయా నిజమా..’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫంక్షన్ లో శివబాలాజీ సుధీర్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. "సుడిగాలి సుధీర్ నాకు కొన్ని సంవత్సరాలుగా తెలుసు. కానీ ఇద్దరం కలిసి స్మాల్ స్క్రీన్ ఎప్పుడూ షేర్ చేసుకోలేదు. ఇప్పుడు ఈ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాం. సుధీర్ మీకు ఎంత ఇష్టమో నాకు కూడా అంతే ఇష్టం. ఎవరితోనైనా మనస్ఫూర్తిగా మాట్లాడతాడు. మంచి మ్యానర్స్ ఉన్న మనిషి. మంచి ఆర్టిస్ట్ కూడా..అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తాడు.
సుధీర్ గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు ఒక లెక్కా..ఈ మూవీ తరువాత నే పొజిషన్ మరో లెక్కలో ఉంటుంది. నా కంపారిజన్ కరెక్టో కాదో నాకు తెలీదు కానీ నువ్వు ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటాను. తమిళ్ లో శివకార్తికేయన్ ఎలాగో ఇక్కడ నువ్వు అలాగ" అని అన్నారు శివబాలాజీ. "గాలోడు, వాంటెడ్ పండుగాడ్" వంటి మూవీస్ తోహీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు సుధీర్.. చేసినవి కొన్ని చిత్రాలే ఐనా హీరోగా తెలుగు ఆడియన్స్ మనసుల్ని దోచుకున్నాడు సుధీర్. ఇక బుల్లితెరకు టోటల్ గా బ్రేక్ ఇచ్చి మూవీస్ మీద ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టాడు. ఐతే బుల్లితెర మీద ఏ షో ప్రోమోని రిలీజ్ చేసినా సరే ఆ కింద కామెంట్స్ లో మాత్రం సుధీర్ ప్రస్తావన లేకుండా ఆడియన్స్, నెటిజన్స్ ఒక్క కామెంట్ కూడా పెట్టరు.. "సుధీర్ కావాలి, సుధీర్ ని షోకి తీసుకురండి, సుధీర్ లేని లోటు తెలుస్తోంది" అని...రకరకాలుగా సుధీర్ మీద ఉన్న ప్రేమను కామెంట్స్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
