Karthika Deepam2: దీపని ఒట్టు వేయమన్న సుమిత్ర.. జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ జరిగేనా!
on Jul 23, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -416 లో...... దీప దగ్గరికి పారిజాతం వచ్చి.. ఎలాగైన ఈ ఎంగేజ్ మెంట్ నువ్వే ఆపాలి గౌతమ్ మంచివాడు కాదు.. జ్యోత్స్న జీవితం నాశనం అయితే సుమిత్ర వాళ్ళు తట్టుకోలేరని పారిజాతం ఎమోషనల్ గా దీపని బ్లాక్ మెయిల్ చేస్తుంది. దీప ఆలోచనలో పడుతుంది .అదంతా విన్న కార్తీక్ దీప దగ్గరికి వస్తాడు. నేను అంతా విన్నాను.. నానమ్మ, మనవరాలికి వేరే దారిలేక ఇదంతా చేస్తున్నారు.. నువ్వు ఎమోషనల్ అవ్వకుండా ఉండు అని దీపకి చెప్తాడు కార్తీక్.
ఆ తర్వాత సుమిత్ర దగ్గరికి దీప వచ్చి అమ్మగారు పిలిచారాట అని అడుగుతుంది. నేను నీకొక కానుక ఇవ్వాలి అనుకుంటున్నానని దీపకి ఒక చీర ఇస్తుంది. అది తీసుకొని దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు ఆ దీపని ఎమోషనల్ గా లాక్ చేసానని పారిజాతం జ్యోత్స్నతో చెప్తుంది. అయితే ఈ ఎంగేజ్ మెంట్ ఆగిపోయినట్లేనా అని జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత సుమిత్ర ఇచ్చిన చీర కట్టుకొని కార్తీక్ దగ్గరికి వెళ్లి చెప్పుకుంటూ మురిసిపోతుంది దీప.
ఆ తర్వాత సుమిత్ర దగ్గరికి దీప వెళ్తుంది. నీ మొహంలో చాలా సంతోషం కనబడుతుంది. నేనొకటి అడగాలని సుమిత్ర అనగానే అడగండి అని దీప అంటుంది. ఇక్కడ కాదు అని పూజ గదికి తీసుకొని వెళ్లి.. ఇప్పుడు చెప్పు ఈ ఎంగేజ్ మెంట్ జరుగుతుంది కదా.. నా కూతురు ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నట్లే ఉంటుంది కదా అని సుమిత్ర అడుగుతుంది. అదంతా కార్తీక్ దూరం నుండి చూస్తూ.. ఇప్పుడు నేను వెళ్తే అత్తకి ఏం సమాధానం చెప్పలేనని కార్తీక్ అనుకుంటాడు. ఈ ఎంగేజ్ మెంట్ జరుగుతుందని నా మీద ఒట్టేసి చెప్పు అని దీప చెయ్ ని తీసుకొని తన తలపై సుమిత్ర పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



