నా కామెడీ గురించి అడగడానికి మీరంతా ఎవరు ?
on Jun 23, 2025
కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ ఈ వారం శనివారం ఎపిసోడ్ లో ఇమ్మానుయేల్ బాగా ఏడ్చేశాడు. ఐతే శ్రీముఖి సాకేత్ కి ఇమ్ముకి ఒక టాస్క్ ఇచ్చింది. సాకేత్ శ్రీముఖిలా చేసాడు. ఇమ్ము ఖిలాడీ గర్ల్స్ ని ఇమిటేట్ చేసాడు. ఐతే ఇమ్ము రోహిణి అదే పనిగా తింటున్నట్టుగా నటించాడు. ఇంతలో సాకేత్ "రోహిణి మెమరీ టాస్క్ లో మీ సైడ్ నుంచి ఎవరొస్తున్నారు" అని గట్టిగ అడిగేసరికి "ఎవరికీ మెమరీ లేదు ఎవరూ రారు..ఐనా మెమరీ మీలో ఎవరికీ లేదేంటి " అనేశాడు ఇమ్ము. దాంతో రోహిణి లైన్ లోకి వచ్చి "చేస్తే నా గురించి చెయ్యి..ఓవర్ యాక్షన్ చెయ్యి ఇలాంటివి చేయకు అంటూ" కౌంటర్ ఇచ్చింది. "ఆల్వేస్ లూజింగ్ బట్ సడెన్లి విన్నింగ్ కెప్టెన్ రోహిణి" అని సాకేత్ అడిగేసరికి ఇమ్ము వెంటనే ఎవరూ రావట్లేదు అనేశాడు.
"మాకు మెమరీ లేదు. బాయ్స్ కి మెమరీ బాగుంది కాబట్టి వాళ్ళకే ఈ గేమ్ ఇచ్చేయండి" అన్నాడు. "మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు..రోహిణి బాధపడుతోంది" అంటూ శ్రీసత్య, ప్రియాంక జైన్ గట్టిగానే చెప్పారు. "ఇమిటేషన్ అంటే నిజాలు చెప్పాలి కానీ అబద్దాలను చెప్పడం కాదు" అని ప్రేరణ చెప్పింది. "ఇది ఇరిటేషన్ లా ఉంది ఇమిటేషన్ లా లేదు.. వేరే వాళ్ళ బాధను నువ్వు ఎలా కామెడీ చేస్తావ్ " అంటూ తేజస్విని మడివాడ అడిగింది. "సారీ మీ అందరికీ సారీ" అని చెప్పాడు ఇమ్ము. అనసూయ ఇమ్ము అని అనేసరికి "మేడం కామెడీని కామెడీలా తీసుకోవాలి" అన్నాడు. దాంతో తేజు వచ్చి "ఈరోజు నువ్వు ఎక్కడా కామెడీ చెయ్యట్లేదు ఈరోజు .. ఎక్స్ట్రాలు చేయకు చాలు " అంది. "మీరు చెప్తే నేను చేసేదేంటి నాకు వచ్చినట్టు నేను చేస్తాను. మీలో ఎవరి గురించైనా చేసానా" అన్నాడు. "కొంచెం ఎక్కువగా చేస్తేనే కదా కామెడీ అవుతుంది. ఉన్నది ఉన్నట్టుగా చేస్తే కామెడీ అవ్వదు కదా. కామెడీని కామెడీలా తీసుకోవడం రాకపోతే ఎలా. నా కామెడీ గురించి అడగడానికి మీరంతా ఎవరు. గర్ల్స్ అంతా ఒకేసారి అరిచారు నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడారు. నాకసలు నచ్చలేదు. ఎవరు ఏమన్నా పడతాను. నవ్వించాలని నాకేం అవసరం. కామెడీ చేస్తేనే సర్వైవ్ అవుతాను. మీకు కామెడీ నచ్చకపోతే చెప్పండి. బాయ్స్ మీద కామెడీ చేయమంటే హ్యాపీగా చేయొచ్చు. కామెడీ సెన్స్ ఉన్నోళ్ళతో కామెడీ చేయాలి..ఎవరినన్నా తప్పుగా అని ఉంటే సారీ " అన్నాడు ఇమ్ము.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
