తెలుగు బిగ్ బాస్ అసలు చూడను...హిందీలో ఒక్క సీజన్ చూసా అంతే
on Jul 8, 2025
.webp)
బిగ్ బాస్ సీజన్ 8 రన్నరప్ గౌతమ్ కృష్ణ హీరోగా నటించిన సోలోబోయ్ డెబ్యూ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇదొక యూత్ ఫుల్ ఫామిలీ డ్రామా. మిడిల్ క్లాస్ ఫామిలీస్ కి కనెక్ట్ అయ్యే మూవీ ఇది. అలాంటి గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ గురించి తన గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను ఇంటర్వ్యూస్ లో చెప్తున్నాడు. "నన్ను నేను బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అనుకోను. నేను కామన్ మ్యాన్ ని. బిగ్ బాస్ నాకు ఒక ప్రాజెక్ట్ లాగా. ఒక అవకాశం వచ్చింది. వెళ్లాను. కానీ నేను ఇంతవరకు తెలుగు బిగ్ బాస్ ఒక్క ఎపిసోడ్ కూడా చూసింది లేదు. నేను కాలేజ్ చదువుకుంటున్నప్పుడు హిందీ బిగ్ బాస్ ఒక్క సీజన్ చూసా అంతే. నా ఫ్రెండ్స్ బిగ్ బాస్ చూస్తూ ఉన్న కూడా బిగ్ బాస్ తీయించేసి సినిమాలు పెట్టించేవాడిని. సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. బిగ్ బాస్ నాకు గుడ్ ఎక్స్పీరియన్స్.
నాకు బాగా యూజ్ అయ్యింది. నేను మొదటి నుంచి రైటర్ ని. రైటింగ్ అంటే నాకు ఇష్టం. ఢిల్లీలో ఎంబిబిఎస్ చదివేటప్పుడు చివర్లో నాకు యాక్టింగ్ సైడ్ ఇంట్రస్ట్ వచ్చింది. కానీ ఎప్పుడు నా ఫోకస్ రైటింగ్ అండ్ డైరెక్షన్ మాత్రమే. క్రికెట్ , న్యూస్, సీరియల్స్ ఏ ఫార్మాట్ ఇష్టం ఉండేది కాదు ఒక్క మూవీస్ అంటేనే ఇష్టం నాకు. అలాగే ఫిలిం వర్క్ షాప్స్ కి వెళ్ళేవాడిని. ఒక షార్ట్ ఫిలిం తీశాను అప్పుడు హీరోగా ఎవరిని అడిగా చేయము అని చెప్పారు. అలా నేనే అందులో హీరోగా చేశా. అప్పుడు నా సర్కిల్ నాకు సజెషన్స్ ఇచ్చారు. అలా ఒక ఆరు నెలలు యాక్టింగ్ కోర్సు చేసాను. ఈ సోలో బాయ్ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ నేనే రాసాను." అని చెప్పాడు గౌతమ్ కృష్ణ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



