'మా అమ్మాయిని దూషించడం తగునా?'.. కంటతడి పెట్టిన నటి తల్లి!
on Nov 23, 2022
సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ 16 లేటెస్ట్ ఎపిసోడ్లో కంటెస్టెంట్ సుంబుల్ తౌఖీర్ తండ్రి ఆడియో సంభాషణ ద్వారా మాట్లాడుతూ ఆమె తోటి కంటెస్టెంట్లు షాలిన్, టీనా దత్తాల సామర్థ్యం ఏమిటో వారికి తెలియజేయాలని కూతురికి బోధించాడు. అంతే కాదు, వారిని ముఖంపై కొట్టమని కూడా సూచించాడు. దాంతో నేషనల్ టీవీలో తన కూతుర్ని దూషించడం, తప్పుగా మాట్లాడటం కరెక్టేనా?.. అని టీనా దత్తా తల్లి ప్రశ్నించింది.
సోమవారం షోలో ఒక ఘటన చోటు చేసుకుంది. వైద్యపరమైన కారణాలతో సుంబుల్తో మాట్లాడే అవకాశం ఆమె తండ్రికి లభించింది. ఆయన రూల్స్‌కు విరుద్ధంగా హౌస్‌కు సంబంధించిన సమాచారాన్ని సుంబుల్కు తెలిపాడు. టీనా, షాలిన్లను కించపరుస్తూ మాట్లాడటమే కాకుండా జాతీయ టెలివిజన్‌లో టీనాను దుర్భాషలాడాడు. సుంబుల్ తండ్రికి రెండోసారి మాట్లాడే అవకాశం వచ్చిందనేది నిజం. ఇది టీనా వాళ్లమ్మను కలవరపెట్టింది.
జాతీయ టీవీపై తన కుమార్తెను కించపరచడం, దుర్భాషలాడటం చూసిన ఆమె భావోద్వేగానికి గురై, కంటతడి పెట్టింది. టీవీలో తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసే అవకాశం రాకపోవడంతో, టీనా సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఒక వీడియోను ఆమె రిలీజ్ చేసింది. జాతీయ వేదికపై తన కుమార్తెను ఎవరైనా కించపరచడం, దుర్భాషలాడటం కరక్టేనా?.. అని వీక్షకులకు విజ్ఞప్తి చేసింది. తమ హోదాను ప్రదర్శించమని చెప్పడం తల్లితండ్రుల కర్తవ్యమా?.. అని కూడా ఆమె అడిగింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
