ప్రేమకి సరికొత్త నిర్వచనమిచ్చిన ప్రగతి!
on Jun 4, 2023
ప్రగతి.. వెండితెరపై తన నటనతో ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్న నటి. అయితే ప్రగతికి సోషల్ మీడియా ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. అదే కాక తనొక యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేసింది. అందులో కుకింగ్ వీడియోలు, హెల్త్ టిప్స్, హెయిర్ ఫాల్ టిప్స్, తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని గుర్తుండిపోయే రోజులని, సెలబ్రేషన్స్ ని అన్నింటిని యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్ చేసి అప్లోడ్ చేస్తుంటుంది.
ప్రగతి కొంతకాలం క్రితం ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్.. లైట్ తీస్కో అనే ఒక వ్లాగ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. అయితే తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో లవ్ గురించి వివరించింది ప్రగతి. "ఒక ఏజ్ వచ్చాక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి లవ్ అని అనుకుంటాడు.. అలాగే అమ్మాయి కూడా అబ్బాయిని చూసి లవ్ అనుకుంటుంది. కానీ అది అట్రాక్షన్.. ఇన్ఫాక్చువేషన్. ఆ తర్వాత కెరీర్ స్టార్ట్ అయ్యాక లవ్ చేస్తారు. అదొక లవ్ అనుకుంటారు. కానీ అది ఫాల్ ఇన్ లవ్.. అంటే ప్రేమలో పడటం.. అంటే ప్రేమించేప్పుడు అందరూ వారి వందశాతం ప్రేమని ఇస్తారు. కానీ ఒక ఏజ్ దాటాక వారిలో స్వార్థం పెరిగిపోతుంది. ముందుగా ఎదుటివ్యక్తి ఎలా ఉన్నాడో చూసి అలానే చూసి ఇష్టపడిన అమ్మాయి.. కొంతకాలం అతనితో ట్రావెల్ అయ్యాక అతడిని తనకి నచ్చినట్టుగా ఉండమనడమేది కరెక్ట్ కాదు కదా.. వాళ్ళు నిజంగా మారాలనుకుంటే వాళ్ళే మారతారు. మన స్వార్థం కోసం వాళ్ళని మార్చాలని చూడకూడదు. ప్యూరిటీ ఉండాలి లవ్ లో.. ఆ అబ్బాయిని స్వేచ్చగా ఉండనివ్వాలి" అని చెప్పుకొచ్చింది ప్రగతి.
ప్రేమించేవాళ్ళ దగ్గర ఇగో ఉండదు. మనకి ఆ వ్యక్తి కావాలనుకుంటే కచ్చితంగా అతనిలోని నెగెటివ్ ని కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. మనలో కూడా తప్పులు ఉంటాయి. వాటిని ఎదుటిమనిషి అర్థం చేసుకోగలిగితే అది మెచ్యూరిటీతో కూడిన లవ్. అదే ఒకరిమీద ఒకరు అరుచుకొని ఆ తర్వాత మాట్లాడుకొని మళ్ళీ కలిసిపోతే అది లవ్ కాదు టాక్సిక్ ప్రేమ అంటే రాక్షస ప్రేమ అంటారు. నిజంగా మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే ద్వేషం ఉండదు. మన వాయిస్ కూడా సైలెంట్ గా ఉంటుంది. నెమ్మదిగా మాట్లాడతాం. అది మెచ్యూరిటీతో పాటు వస్తుందని ప్రగతి చెప్పింది. ఇలా తను పొందిన అనుభవాలను, తను చూసిన ప్రేమజంటలని ఉదాహరణలుగా తీసుకొని లవ్ ఏ స్టేజ్ లో ఎలా ఉంటుందో వివరించింది ప్రగతి. కాగా ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో అత్యంత వీక్షకాధరణ పొందుతుంది.
Also Read