అప్పట్లో తెలియకుండా వాళ్ళ సీట్ లాగేసుకున్న..అందుకు సారీ చెప్పిన రాఘవ!
on Nov 28, 2022
రాకెట్ రాఘవ తన లైఫ్ లో ఎప్పటికీ మరిచిపోలేని ఒక విషయం గురించి థ్యాంక్యూ అలాగే సారీ కూడా చెప్పాడు ఈవారం ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీలో. కాయిన్స్ టాస్క్ లో భాగంగా రాఘవ ఒక గ్లాస్ లోని జ్యూస్ తాగాడు. అందులో సిల్వర్ కాయిన్ వచ్చింది. ఎవరికీ థ్యాంక్యూ చెప్పాలి అనుకుంటున్నారని రష్మీ అడిగేసరికి " నేను ఫస్ట్ టైమ్ హైదరాబాద్ కి ట్రైన్ లో వస్తున్నావు. అప్పటికి నా దగ్గర టికెట్స్ లేవు. ట్రైన్ ఫుల్ రష్ గా ఉంది.
ఎక్కడానికి దారి కూడా లేదు. అప్పుడే మా ఊరి అబ్బాయి ఒకతను కనిపించాడు. అతను ఫిజికల్లీ చాలెంజెడ్ పర్సన్. వాళ్ళ కోసం సెపరేట్ గా ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది. నన్ను చూసిన అతను నాతో రండి నేను తీసుకెళ్తాను అని తన కంపార్ట్మెంట్ లోకి తీసుకెళ్లాడు. ఫిజికల్లీ చాలెంజెడ్ పర్సన్స్ భోగి కాబట్టి వాళ్లకు ఫ్రీ పాస్ ఉంటుంది. వాళ్ళతో ఒక అటెండెంట్ కూడా ఫ్రీగా వెళ్లొచ్చు. ఇక నేను అతనితో ఆ భోగిలోకి ఎక్కేసాను. ఆ బోగీలో మొత్తం ఫిజికల్లీ చాలెంజెడ్ వాళ్ళే చాలా మంది ఉన్నారు. నాకు తెలియకుండానే నేను వాళ్ళ కోటాలో ఒక సీట్ తీసేసుకున్నాను ఆ రోజు.
ఆ రోజు చాలా బాధేసింది నాకు. ఆ రాత్రంతా వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. నిజంగా మనకంటే వాళ్ళే గొప్పవాళ్ళు, వాళ్ళే తెలివైనవాళ్లు..ఆరోజు తెలియకుండా అలా చేసాను. వాళ్ళ కోసం ఉన్నవాటిని మనం ఎప్పుడూ తీసుకోకూడదు అని అప్పుడు నాకు అనిపించింది. అందుకే వాళ్లకు ఈ స్టేజి ద్వారా సారీ చెప్తున్నా" అని రాఘవ తన మనసులో భావాన్ని చెప్పాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
