నా కూతురికి సారీ చెప్పాలి..ఈ స్టేజి మీదే ఈసారి తన బర్త్ డే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తాను!
on Nov 28, 2022
శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ వారం కాయిన్స్ టాస్క్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఇక రాంప్రసాద్ స్టేజి మీదకు వచ్చి ఒక గ్లాస్ లోని జ్యూస్ తాగాడు. ఐతే అందులో ఫైనల్ గా గోల్డ్ కాయిన్ వచ్చింది.
మరి ఎవరికీ సారీ చెప్దామనుకుంటున్నావ్ అని రష్మీ అడిగేసరికి " నా కూతురు ఉజ్వలకి సారీ చెప్పాలి ఎందుకు అంటే నేను తన కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నా..చిన్నప్పటినుంచి తనతో ఎక్కువ టైం ఉండడానికి అస్సలు సెట్ అవట్లేదు. ఉజ్వల సారీ. ఇంట్లో ఉంటే ఉజ్వల చాలా అల్లరి చేస్తుంది. నేను ఇంకా నిద్రపోతూ ఉంటే మాత్రం నా దగ్గరకు వచ్చి దుప్పటి తీసి నాన్న అని పిలిచి ముఖం మీద గట్టిగా కొట్టి లేపేస్తుంది. ఉజ్వల ఫస్ట్ బర్త్ డే గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేశా. కానీ అప్పటికి పాండమిక్ టైం.
ఇక ఆ టైములో పది మాత్రమే బర్త్ డే సెలెబ్రేట్ చేసాం చాలా ఫీల్ అయ్యాను. సెకండ్ బర్త్ డే టైంకి కూడా ఇంకా కోవిడ్ కంటిన్యూ అవుతోంది. అప్పుడు కూడా గ్రాండ్ గా చేయలేకపోయాను. ఏదో ఒక రోజు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీదే ఉజ్వల బర్త్ డే చేద్దాం" అని రాంప్రసాద్ తన కూతురి గురించి చెప్పాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
