ఇనయా గురించి ఆర్జీవి సెన్సేషనల్ కామెంట్స్!
on Nov 28, 2022
బిగ్ బాస్ హౌస్ లో కూడా ఆర్జీవి ట్రెండింగ్ సాగుతోంది. ఎందుకంటే గత సీజన్లలో అషురెడ్డి, అరియాన ల మీద ఆర్జీవి కామెంట్స్ చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అవకాశం వచ్చింది. అలాగే ఇనయాకి కూడా సేమ్ టూ సేమ్ అలాగే.. ఒక పార్టీలో ఇనయాతో కలిసి ఆర్జీవి చేసిన డ్యాన్స్ బయటకొచ్చింది. అది కాస్తా వైరల్ అయ్యింది. దీంతో ఇనయా ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది.
ఇనయా గురించి ఒక ఇంటర్వ్యూలో ఆర్జీవి మాట్లాడాడు. " తనకి సపోర్ట్ చేయండి. తను చాలా కామ్. బిగ్ బాస్ లాంటి దానిలో తను ఎలా ఉంటుందో అని అనుకున్నాను. కానీ బాగానే పర్ఫామెన్స్ ఇస్తుంది" అంటూ ఆర్జీవి అన్నాడు. ఆ డ్యాన్స్ వీడియో మీ వల్లే వైరల్ అయింది కదా? అని అడుగగా.. "ఆ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేసే ముందు నేను తనని అడిగాను. తాను ఓకే చెప్పింది. పోస్ట్ చేశాను. ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో ఆమె అందానికి ముగ్ధుడునై, తాగిన మైకంలో డాన్స్ చేశాను. నేను బిగ్ బాస్ రోజూ చూడను. అప్పుడప్పుడు చూస్తా, చూసినప్పుడు తెలిసింది ఏంటంటే ఇనయా కాన్ఫిడెన్స్ లెవెల్ , ఇంకా అటతీరు కూడా బాగుంది. మొదటి రెండు వారాల్లోనే బయటకు వచ్చేస్తుందని అనుకున్నాను. కానీ టాప్ ఫైవ్ వరకు వచ్చింది. I am very Happy. మీరు కూడా సపోర్ట్ చేయండి" అంటూ ఆర్జీవి చెప్పుకొచ్చాడు.
ఇలా ఆర్జీవి కామెంట్స్ చేసాక ఫేమస్ అయిన వాళ్ళు ప్రతీ సీజన్లోను టాప్ ఫైవ్ లో ఉంటూ వస్తున్నారు. అయితే ఇనయాకు పోటీగా రేవంత్ ఉన్నాడు. ఇప్పుటి నుండే అసలైన సవాల్ ఎదర్కోనుంది ఇనయా.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
