వంటలక్కని మళ్ళీ రమ్మని కోరుతున్న నెటిజన్స్
on Feb 6, 2023
బుల్లితెర మీద టాప్ రేటింగ్ లో దూసుకుపోయిన సీరియల్ "కార్తీక దీపం". ఈ సీరియల్ ప్రతీ ఇంట్లో ఒక ఫామిలీ మెంబర్ లా చక్రం తిప్పింది. ఆడియన్స్ వంటలక్కని సొంత మనిషిలా చూసుకునేవారు. ఆమె సీరియల్ లో ఏడిస్తే ఇక్కడ ఆడియన్స్ కూడా ఏడ్చేవారు. మోనితను సొంత శత్రువుల ఫీలయ్యి తిట్టేవాళ్ళు. డాక్టర్ బాబుని నిజమైన డాక్టర్ లా అనుకుని హారతులిచ్చారు.
ఇలాంటి సీరియల్ కి శుభం కార్డు పడేసరికి ఆడియన్స్ ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఈ సీరియల్ ఎంత పేరు సంపాదించుకుంది అంటే రీసెంట్ గా రిలీజ్ ఐన వెబ్ సిరీస్ లో కూడా దీని ప్రస్తావన వినిపిస్తుంది. అలాంటి సీరియల్ కాస్త ఐపోయేసరికి ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తోంది. దాని ప్లేస్ లో వచ్చిన బ్రహ్మముడికి ఇంకా ఎవరూ కనెక్ట్ కాలేదు. మరి మన వంటలక్క ఇప్పుడు తన ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. చిల్ అవుతోంది. హాయిగా రిలాక్స్ అవుతోంది. ఆ రిలాక్సింగ్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఫుల్ కామెంట్స్ పెడుతున్నారు.
"మిమ్మల్ని మేము చాలా మిస్ అవుతున్నాం దీప గారు మీరు ఒక్క సీరియల్ తీయోచ్చు కదా మళ్లీ మాటీవీలో..మిస్ యు దీప" అని వాళ్ళ బాధను షేర్ చేసుకున్నారు. కార్తీక దీపం 2 ఎంత తొందరగా వస్తే అంత బాగుండు అనుకుంటున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
