Karthika Deepam 2 : దీపపై జ్యోత్స్నకి డౌట్.. డబ్బు ఇవ్వనన్న శ్రీధర్!
on Jun 29, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -396 లో... జ్యోత్స్న చేసిన పని గురించి శివన్నారాయణతో చెప్తాడు కార్తీక్. అదంతా విని జ్యోత్స్నని తిడతాడు శివన్నారాయణ. ఆ తర్వాత జ్యోత్స్న చేత దీపకి సారీ చెప్పిస్తాడు.
దీప గాజు ముక్కలు క్లీన్ చేస్తుంటే తర్వాత చెయ్యొచ్చు కదా అని కార్తీక్ అనగానే ఇలాంటివి ప్రమాదకరం అయిన వాటిని ఎంత త్వరగా క్లీన్ చేస్తే అంత మంచిదని దీప అంటుంది. ఆ మాటలకి దీప మనల్ని అన్నట్లు ఉందని జ్యోత్స్న, పారిజాతం అనుకుంటారు. దీప ఏంటి ఏదో నిజం తెలిసినట్లు మాట్లాడుతుందని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్, దీప వెళ్ళిపోతారు. జ్యోత్స్న ఏంటి దీప వల్ల ఇన్ని మాటలు పడాల్సి వస్తుందని సుమిత్ర అనుకుంటుంది. ఆ తర్వాత కాశీ తన ఫ్రెండ్ కి ఒకతని దగ్గర అప్పు ఇప్పిస్తాడు. అతను కాశీని వచ్చి డబ్బు ఇవ్వమని గొడవ చేస్తాడు. ఆ విషయం స్వప్న కి తెలిసి కాశీతో గొడవ పడుతుంది.
మరొకవైపు దశరథ్ దగ్గరికి శివన్నారాయణ వచ్చి.. మీ చెల్లికి ఎలా ఉందో కనుక్కోమని.. ఇండైరెక్ట్ గా వీడియో కాల్ చేయమని అడుగుతాడు. దాంతో దశరత్ వీడియో కాల్ లో కాంచన ని చూస్తాడు. అప్పుడు నాన్న అని కాంచన పిలవగానే శివన్నారాయణ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కాంచన మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు కాశీకి డబ్బు కావాలని కావేరిని అడుగుతుంది స్వప్న. కావేరి లాకర్ కీస్ కావాలని శ్రీధర్ ని అడుగుతుంది. ఎందుకు చెప్పు అని శ్రీధర్ అనగానే.. జరిగింది మొత్తం కావేరి చెప్తుంది. దాంతో కాశీని తిడతాడు శ్రీధర్. నాకు నీ డబ్బేం అవసరం లేదని స్వప్న కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
