మొదట్లో స్నేహితులు.. ఇప్పుడు శత్రువులు ఎలా అయ్యారు?
on Nov 22, 2022
బిగ్ బాస్ హౌస్‌లో మొదటగా ఇనయా స్నేహం చేసింది ఫైమా, రాజ్, సూర్యలతో.. అలాంటిది ఇప్పుడు రాజ్, ఫైమా శత్రువులుగా మారిపోయారు. కారణం.. మధ్యలో జరిగిన టాస్క్‌లు ఒక కారణం కాగా, రెండవది ఫైమా, ఇనయా ఎవరి గేమ్ పరంగా వారు ఆలోచిస్తూ ఇండివిడ్యువల్‌గా ఉండటమే వీరి మధ్య శత్రుత్వానికి దారి తీసిందని, బిగ్ బాస్ వీక్షకులు భావిస్తున్నారు.
కాగా నామినేషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ని సీక్రెట్ రూంకి పిలిచి నామినేషన్ వేయమన్నాడు. అయితే సీక్రెట్ రూంకి వెళ్ళిన ఇనయా ఎమోషనల్ అయింది. "హౌస్ లోకి వచ్చిన వెంటనే సూర్య, రాజ్, ఫైమా నాకు బాగా క్లోజ్ అయ్యారు. సూర్య వెళ్ళిపోయాడు. నాకు, సూర్యకి గొడవ అయితే రాజ్, ఫైమా దూరం అయ్యారు. ఒకప్పుడు మేము ఫ్రెండ్స్ గా ఉన్నాం..అలాంటిది ఇప్పుడు వారిద్దరిని నామినేట్ చేయాల్సి వస్తోంది" అని బిగ్ బాస్‌తో చెప్పుకొచ్చింది.
ఇలా తన బాధను చెప్పుకుంటూ కంటతడి పెట్టుకున్న ఇనయా, మొదట ఫైమాని నామినేట్ చేసింది. "గతవారం జరిగిన టాస్క్‌లో ఫైమా నన్నే టార్గెట్ చేస్తూ ఆడి, నన్ను టాస్క్‌లో ఓడిపోయేలా చేసింది" అని చెప్పింది. తర్వాత రాజ్‌ని నామినేట్ చేసింది. "రాజ్ నా మీద పర్సనల్‌గా కోపం పెంచుకొని, కావాలని నన్ను నామినేట్ చేసాడు" అని చెప్పింది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు ఇనయాకి దూరంగా ఉంటున్నారు. కారణం తను ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అందుకే రాజ్ తననుండి దూరంగా ఉంటూ.. జాగ్రత్తగా ఉంటున్నాడేమోనని అనిపిస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
