'బిగ్ బాస్ హౌస్‌లోకి రీఎంట్రీయా.. అంత సీన్ లేదు'! తేల్చేసిన గీతు!!
on Nov 23, 2022
బిగ్ బాస్ సీజన్ 6లో గీతూ రాయల్ తన యాసతో మంచి గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఈమె బిగ్ బాస్ హౌస్‌లో టాప్ ఫైవ్‌లో ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఎలిమినేట్ ఐపోయింది. ఐతే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు ఈమె సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే గీతూ బిగ్ బాస్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపించాయి.
ఈ వార్తలపై గీతు స్పందించింది. తాను ఇక బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసింది. "రీఎంట్రీ ఇచ్చాక ఇలాగే మధ్యలో వెళ్లాల్సి వస్తే ఆ బాధ ఇంకా నేను తట్టుకోలేను కాబట్టి మళ్ళీ వెళ్ళను" అని చెప్పింది. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినప్పుడు తన బాధ అంతా ఇంతా కాదని తెలిపింది.
ఎప్పుడైతే తన ఎలిమినేషన్ గురించి బిగ్ బాస్ చెప్పాడో ఆ క్షణం ఎంతో బాధేసిందని చెప్పింది. "నా లైఫ్ లో హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది నా ఎలిమినేషన్" అంది గీతూ. ఈ చిట్ చాట్‌లో భాగంగా "రేవంత్ హౌస్ లో ఉన్నప్పుడు మీతో పోట్లాడాడు, అయితే మీరు ఎలిమినేట్ అయినప్పుడు ఏడ్చాడు" అని అడిగేసరికి, "రేవంత్ నా దగ్గర మంచిగా మాట్లాడి పక్కకు వెళ్లేటప్పుడు బ్యాడ్‌గా మాట్లాడేవాడు. అయితే నేను ఎలిమినేట్ అయినప్పుడు మాత్రం అతని ఏడుపు మాత్రం రియల్" అంటూ సమాధానమిచ్చింది. ఇక ఆదిరెడ్డి గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
