Brahmamudi : రాజ్ గతంలో యామిని ఒక్కతే ఉన్నట్టు డ్రామా.. హాస్పిటల్ లో కావ్య!
on Mar 14, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -668 లో... రాజ్ లేడు, రాడని మీరు చెప్పట్లేదని రుద్రాణి అనగానే.. నీకు అసలు బుద్ధి ఉందా.. అంత దుఃఖంలో ఉన్న వాళ్ళని ఓదార్చాలిసింది పోయి ఇంకా బాధపెడతావా.. నువ్వు మారవు అని ఇందిరాదేవి రుద్రాణిని తిడుతుంది.
మరొకవైపు యామిని రాజ్ తో ఎంగేజ్ మెంట్ అయినట్లు మంచిగా క్రియేట్ చేసిందని ఫొటోస్ చూస్తూ యామిని వాళ్ల నాన్నతో ఆమె తల్లి చెబుతుంది. అప్పుడే యామిని వస్తుంది. ఇలా మాయాజాలంలో ఉండడం నాకూ నచ్చడం లేదని యామిని వాళ్ల నాన్న అంటాడు. కాలేజీ డేస్ లో ఇలాగే చేసావ్.. అప్పుడు కూడా ఇలా చెయ్యొద్దన్నాను వినలేదు.. మత్తుకి బానిసై మళ్ళీ బాగై వచ్చి ఇలా చేస్తున్నావని వాళ్ల నాన్న అంటాడు. రాజ్ కి గతంలో నేను మాత్రమే ఉన్నట్లు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాను.. మీరు అడ్డు రాకండి అని యామిని అంటుంది. తన జీవితం తనకి నచ్చినట్లు ఉండనివ్వండి అని వాళ్ల అమ్మ అంటుంది.
ఆ తర్వాత కావ్య భోజనం చేయడానికి అందరిని పిలుస్తుంది. రాజ్ లేడన్న విషయం తెలిసి బాధలో మాకు తినాలి అనిపించడం లేదని చెప్పండి అని రుద్రాణి అనగానే.. అలా ఏం కాదు మా ఆయన ఉన్నాడు.. మీరు నమ్మండి అంటూ అందరిని భోజనం దగ్గరికి తీసుకొని వెళ్తుంది కావ్య.
ఆ తర్వాత రాజ్ తో కలిసి యామిని వాళ్ళు భోజనం చేస్తుంటారు. నువ్వు యామినిని ఎంతగానో ప్రేమించావని యామిని వాళ్ల అమ్మ అంటుంది. నాకు ఎందుకో చీకటిగా ఉంది. ఏం అర్థం అవ్వడం లేదని రాజ్ అనగానే.. యామిని లైట్స్ ఆఫ్ చేస్తుంది. కాండిల్ లైట్ ఎరేంజ్ చేసి.. చీకట్లో ఉన్నానని ఫీల్ అవుతున్నావ్ కదా బావ.. ఇద్దరం కలిసి నడవచ్చని తన చెయ్ ఇస్తుంది. దాంతో రాజ్ తన చేతిలో చెయ్ వేస్తాడు. ఇక యామిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజ్ భోజనం చేస్తుంటాడు. మరొకవైపు కావ్య అందరికి భోజనం వడ్డీస్తుంది. అపర్ణ మాత్రం నా వాళ్ళ కాదు అంటూ తినకుండా వెళ్ళిపోతుంది. అందరు ఒక్కొక్కరుగా తినకుండా వెళ్లిపోతారు.
తరువాయి భాగంలో రాజ్ వెళ్తుంటే కావ్య చూసి రాజ్ కార్ వెనకాలే పరుగెడుతుంది. రాజ్ దగ్గరికి రాగానే కావ్య కళ్ళు తిరిగిపడిపోతుంది. దాంతో కావ్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
