బిగ్ సర్ ప్రైజ్.. 'బిగ్ బాస్' హౌస్ లోకి యంగ్ హీరో!
on Jun 22, 2022
బిగ్ బాస్ తెలుగులో టాలీవుడ్ కుర్ర హీరోలు వరుణ్ సందేశ్, తనీష్, ప్రిన్స్, అభిజీత్ ఇలా ఎందరో సందడి చేశారు. అభిజీత్ మినహా మిగతా వారికి బిగ్ బాస్ వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. అయితే ఇప్పుడు మరో కుర్ర హీరో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ 'తూనీగ తూనీగ'(2012) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'అంతకు ముందు ఆ తరువాత', 'కేరింత' వంటి సినిమాలతో అలరించిన సుమంత్ కు హీరోగా ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. తన తండ్రి డైరెక్ట్ చేసిన '7 డేస్ 6 నైట్స్'తో ఈ నెల 24న ప్రేక్షకులను పలరించనున్న ఈ కుర్ర హీరో.. బిగ్ బాస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటున్నాడట.
బిగ్ బాస్ తెలుగు సీజన్-6 త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరేనంటూ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా యంగ్ హీరో సుమంత్ అశ్విన్ పేరు తెరమీదకు వచ్చింది. ఇటీవల షో నిర్వాహకులు సుమంత్ ని సంప్రదించగా, కంటెస్టెంట్ గా షోలో పాల్గొనడానికి ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పదేళ్లుగా హీరోగా బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సుమంత్.. ఈ షోతో ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూస్తున్నాడట.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
