హోటల్ రూమ్ బుక్ చేసుకుని నేను అష్షు...
on May 21, 2025
.webp)
ఫ్యామిలీ స్టార్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో బుల్లితెర ఉన్న సగం స్టార్స్ అలాగే సింగర్స్ కూడా వచ్చారు. సమీరా భరద్వాజ్, సాకేత్ కొమాండూరి, పవిత్ర, టేస్టీ తేజ, తేజస్విని గౌడ, శోభా శెట్టి, రచ్చ రవి, పంచ్ ప్రసాద్, రంగస్థలం మహేష్ వంటి వాళ్లంతా వచ్చారు. ఐతే ఇక్కడ అష్షు రెడ్డి, చొక్కారావు స్రవంతి ఇద్దరూ కలిసి బాంగ్ కాక్ అని ఒకరు, కాదు గోవా అని ఒకరు పోటీ పడుతూ ఉండేసరికి సుధీర్ ఒక డౌట్ అడిగాడు. "గోవా అంటున్నారు, బాంగ్ కాక్ అంటున్నారు.. ఉండడానికి ఏది బెస్ట్ ప్లేస్" అని సుధీర్ అడిగేసరికి "నీకైతే తీహార్ కరెక్ట్ ఏమో అని నా డౌట్" అంది సమీరా..దాంతో సుధీర్ షాకైపోతాడు.
తర్వాత శోభా శెట్టిని చూసి "శోభా గారు మీరు సముద్రంలోకి దిగను అంటేనే మిమ్మల్ని ట్రిప్ కి తీసుకెళ్తా" అంటాడు సుధీర్. "ఎందుకు" అంటుంది శోభా. "మీ పెదాలు తగిలి సముద్రపు నీళ్లు తియ్యగా ఐపోయి చేపలకు షుగర్ వస్తే" అంటూ ఒక సెటైర్ వేసాడు. దాంతో అందరూ నవ్వారు. తర్వాత అష్షు రచ్చ రవిని ఎక్కడ కలిసిందో చెప్పింది. "నేను రచ్చ రవి గారిని కలిసింది గోవాలోనే. సంపూర్ణేష్ బాబు సినిమాలో నేను రచ్చ రవి గారు కలిసి చిన్న క్యారెక్టర్స్ చేసాము. అక్కడ కలిసాము ఇద్దరం." అని చెప్పింది అష్షు. "ఆ ట్రిప్ కి వెళ్ళొచ్చిందగ్గర నుంచి గోవా లోనే ఉన్నారా" అని అడిగింది సమీరా. తర్వాత చొక్కారావు స్రవంతి చెప్పుకొచ్చింది.."నేను అష్షు ఒక రోజు...పెద్ద మూడ్ స్వింగ్స్ దీనికి. దుబాయ్ టికెట్స్ ఉన్నాయి పొద్దున్నే వెళ్లిపోదామా అని ముంబై తీసుకెళ్లింది. అక్కడ ఎం చేసామో తెలుసా ..ఎయిర్ పోర్ట్ దగ్గర ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకుని ఇద్దరం.." అని చెప్పేసరికి "ఏంటి మీరిద్దరా" అంటూ రంగస్థలం మహేష్ అడిగేసరికి అందరూ షాకయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



