Home

»

Exclusive Movie News

ఆ ఎవ‌ర్‌గ్రీన్‌ సీన్‌తో ఇండస్ట్రీని ఊపేసిన రజినీకాంత్.!

Jul 6, 2026 7:00PM

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కమర్షియల్ సినిమాల ట్రెండ్‌ను ఒక్కసారిగా మార్చేసి, రీ-రిలీజ్‌లో కూడా కలెక్షన్ల వర్షం కురిపించిన ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రం 'బాషా'. సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లోనే కాకుండా, సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మైలురాయిగా నిలిచిన ఈ సినిమాలోని ప్రతీ సీన్ ఒక సంచలనం. ఒక సాదాసీదా ఆటో డ్రైవర్ మాణిక్యం వెనుక, ముంబైని శాసించిన అండర్ వరల్డ్ డాన్ ‘మాణిక్‌ బాషా’ ఉన్నాడనే నిజం రివీల్ అయ్యే ఇంటర్వెల్ బ్లాక్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. సినిమా విడుదలై ఇన్నేళ్లయినా, ఇప్పటికీ ఈ చిత్రంలోని అల్టిమేట్ సీన్స్ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. 

కథలోకి వెళ్తే, మాణిక్యం తమ్ముడు శివ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి హాజరవుతాడు. ముంబై బ్యాక్‌డ్రాప్ ఉన్న శివ బయోడేటాను చూసిన డిజిపి, అతని తండ్రి రంగస్వామి, తల్లి పార్వతి వివరాలను అడిగి తెలుసుకుంటారు. ప్రస్తుతం శివ తన అన్నయ్య మాణిక్యం వద్ద ఉంటున్నాడని, అతను ఒక సాధారణ ఆటో డ్రైవర్ అని తెలియగానే, డిజిపి వెంటనే ఆ మాణిక్యాన్ని తన చాంబర్‌కు పిలిపించాల్సిందిగా ఆదేశిస్తారు. తమ్ముడి ఉద్యోగం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మాణిక్యం, పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. 

#Rajanikanth Ultimate Scene : https://www.youtube.com/watch?v=zK7fKtcqPCA

డిజిపి ఎంతో గంభీరంగా మాణిక్యాన్ని చూస్తూ, "బాంబేలో మాణిక్యం అనే నా పాత ఫ్రెండ్ ఒకరు ఉండేవారు, అతననుకుని పొరపాటున పిలిపించాను" అంటూ అసలు విషయాన్ని దాచిపెట్టి, గత నాలుగేళ్లుగా ఆటో నడుపుతున్న మాణిక్యం వ్యక్తిగత జీవితం గురించి ఆరా తీస్తారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని, దేవుడి దయ వల్ల జీవితం బాగుందని మాణిక్యం ఎంతో వినయంగా సమాధానం ఇస్తాడు. ఒక పేపర్‌పై సంతకం చేయించుకుని మాణిక్యాన్ని పంపించి వేసిన వెంటనే, డిజిపి తన సబార్డినేట్ ఆఫీసర్‌తో చెప్పే ఒకే ఒక్క మాట థియేటర్లను షేక్ చేస్తుంది. "బాంబే బాషా ఫైల్ తీసుకురండి!". ఆ పేరు వినగానే ఆఫీసర్ ఒక్కసారిగా వణికిపోతూ, ముంబై స్మగ్లర్ల గుండెల్లో నిద్రపోయిన ఆ భయంకరమైన వ్యక్తి చనిపోయి నాలుగేళ్లు అవుతోందని గుర్తుచేస్తాడు. కానీ డిజిపికి తెలుసు, ఆటో నడుపుతున్నది సాదాసీదా మనిషి కాదు, ముంబైని వణికించిన డాన్ అని.

మరోవైపు, నగరంలో కోట్లాది రూపాయల విలువైన డైమండ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టు చప్పుడు కాకుండా తమ దందాను సాగిస్తుంటుంది. ఒకానొక సందర్భంలో 10 అత్యంత ఖరీదైన వజ్రాలు ఉన్న పర్స్‌ను స్మగ్లర్ కూతురు ప్రియ అనుకోకుండా మాణిక్యం ఆటోలో మర్చిపోతుంది. రోడ్డుపై గొడవలంటేనే ఆమడదూరం పారిపోయే, ఆడపిల్లలు ఎంతో పద్ధతిగా ఉండాలని కోరుకునే అమాయకపు ఆటో డ్రైవర్ మాణిక్యం, ఆ వజ్రాల పర్స్‌ను చూసి ఏమాత్రం ఆశపడకుండా తిరిగి ఇచ్చేస్తాడు. "లక్షల విలువైన ఈ వజ్రాలను మీరే ఉంచుకుంటే పెద్ద బంగళా కట్టుకుని హాయిగా ఉండొచ్చు కదా" అని ప్రియ అడగ్గా, మాణిక్యం చెప్పే నీతి నిజంగా ఆలోచింపజేస్తుంది. పాపపు సొమ్ముతో బంగళా కడితే మనశ్శాంతి, నిద్ర, ఆకలి ఉండవని, అందుకే కష్టపడి సంపాదించే ఆటో జీవితమే మిన్న అని చెబుతాడు. అయితే, ఇంటికి వెళ్ళాక ఆ స్మగ్లర్ తన వజ్రాలను లెక్కిస్తే కేవలం 9 మాత్రమే ఉంటాయి. ఒక్కొక్క డైమండ్ విలువ అక్షరాలా రూ. 40 లక్షలు. 

దీంతో మొత్తం రూ. 40 లక్షల విలువైన ఆ ఒక్క వజ్రం కోసం స్మగ్లర్ గ్యాంగ్ రోడ్డుపై వెళ్తున్న మాణిక్యం ఆటోను అడ్డగిస్తుంది. అతనిపై దాడి చేసి, జీవనాధారమైన ఆటోను ముక్కలు ముక్కలుగా ధ్వంసం చేస్తూ, వజ్రం ఎక్కడ దాచావో చెప్పాలంటూ చిత్రహింసలు పెడుతుంటారు. తన అన్నయ్య గతాన్ని దాచిపెట్టి ఎంత శాంతంగా ఉంటున్నాడో తెలిసిన అభిమానులకు, ఈ సీన్ చూస్తున్నప్పుడు నరాలు తెగిపోయేంత ఉత్కంఠ కలుగుతుంది. చివరకు ఆ డైమండ్ వారి కారులోనే దొరకడంతో, వారు అక్క‌డి నుంచి వెళ్ళిపోతారు. కానీ, ఆటో డ్రైవర్ వెనుక దాగున్న అండర్ వరల్డ్ టైగర్ ఎప్పుడు మేల్కొంటుందా అని ప్రేక్షకుడు ఊపిరి బిగబట్టి చూసేలా చేసిన ఈ సీన్, ఇండియన్ సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలివేషన్ సీన్‌గా నిలిచిపోయింది. ఇలాంటి పవర్‌ఫుల్ సీన్స్ కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 

 

 

Rajinikanth, Baasha

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com